Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

అనంతపురం జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు అటు వాహనదారులను ఇటు జిల్లా వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

Accidents

Road Accident: అనంతపురం జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు అటు వాహనదారులను ఇటు జిల్లా వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మూడు రోజుల క్రితం నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద మినీ బస్సు బోల్తా పడి ముగ్గురు మృతి చెందిన ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే.. బుధవారం మరో ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కలవరపెడుతుంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రాంనేపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. రిపేరులో ఉన్న మినీ లారీని మరో వాహనం సహాయంతో తరలిస్తుండగా..ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది.

Also read: Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వాహనదారులకు ఊరట

దీంతో మినీ లారీని తరలిస్తున్న వాహనంలో ఉన్న ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులచే సమాచారం అందుకున్న రాప్తాడు పోలీసులు.. ప్రమాద స్థలికి చేరుకొని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Extra Marital Affair : మహిళా కానిస్టేబుల్‌తో తహసిల్దార్ వివాహేతర సంబంధం-హత్య

కాగా అనంతపురం జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులు 44, 42తో పాటు రాష్ట్ర రహదారులు 57, 61, 64లలో తరచూ వాహన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం దాటిన తరువాత కర్ణాటక సరిహద్దు భాగేపల్లి వరకు ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. స్థానిక ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు హైవే రూల్స్ పై అవగాహన లేకపోవడంతో వారు ప్రమాదాల్లో చికుక్కుకోవడం గానీ, వారి బాధ్యతారాహిత్యంతో ఇతర వాహనదారులు ప్రమాదాల భారిన పడుతున్నట్లు తెలుస్తుంది. పోలీసులు చొరవ తీసుకుని.. స్థానిక ప్రాంత ప్రజలకు రోడ్డు రూల్స్ పై అవగాహన కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు.

Also read: Anantapur Road Accident : పచ్చని పెళ్లిపందింట్లో మరణశోకం..వధువు తండ్రితో సహా 9 మంది మృతి