Anantapur Road Accident : పచ్చని పెళ్లిపందింట్లో మరణశోకం..వధువు తండ్రితో సహా 9 మంది మృతి

రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 9మంది మృతదేహాలకు అర్ధరాత్రి పోస్ట్‌‌మార్టం నిర్వహించి తెల్లవారు జామున 4 గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు...

Anantapur Road Accident : పచ్చని పెళ్లిపందింట్లో మరణశోకం..వధువు తండ్రితో సహా 9 మంది మృతి

Road Accidents

Anantapur Road Accident  : ఒక్కనాగొక్క కూతురు..అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. గొప్ప సంబంధం వచ్చింది. మంచి సంబంధం అని కూతురికి ఘనంగా వివాహం జరిపించాడు. పెళ్లికి వచ్చిన అతిథులు నూతన జంటను ఆశీర్వదించారు. కూతురిని అత్తారింటికి పంపుతూ..పెళ్ళిలో జరిగిన ఘటనలను తలచుకుంటూ.. మురిసిపోతూ వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం కబలించి వేసింది. మృత్యురూపంలో వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. దీంతో నింబగల్లు తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువుల రోదనతో నిండిపోయింది.

Read More : Corona Vaccine: భారత్‌లో మరో కరోనా వ్యాక్సిన్.. సింగిల్-డోస్‌ చాలు

అనంతపురం జిల్లా నింబగల్లు ప్రాంతానికి చెందిన బీజేపీ నేత కోకా వెంకటప్ప నాయుడు (58) కూతురి వివాహం బళ్లారీలోని అల్లం భవన్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత వెంకటప్ప నాయుడు, ఆయన దగ్గరి బంధువులు మొత్తం 8 మంది ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. బూదగవి వద్ద అనంతపురం నుంచి బళ్లారి వైపు వెళుతున్న 16 చక్రాల ఐరన్ ఓర్ లారీ అత్యంత వేగంగా ఇన్నోవా వాహనాన్ని ఢీకొంది. వాహనంలో ఉన్న వారందరికీ తీవ్రగాయాలయ్యాయి. 8 మంది స్పాట్ లోనే చనిపోగా.. కొనఊపిరితో ఉన్న వెంకటప్ప నాయుడిని ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. కొద్ది నిమిషాల్లోనే చనిపోయాడు.

Read More : Schools ReOpen: కరోనా తగ్గుముఖం.. పలు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం

వీరి మరణ వార్త తెలియడంతో నింబగల్లు గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. బొమ్మనహాళ్ కు చెందిన సరస్వతి, ఆమె కుమారుడు అశోక్, కుమార్తె స్వాతి, మనవడు జశ్వంత్, మనవరాలు జాహ్నవి, కణేకల్లు మండలం హనుమాపురం ప్రాంతానికి చెందిన రాధమ్మ, బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి, రాయలప్పదొడ్డి ప్రాంతానికి చెందిన శివమ్మ, సుభద్రమ్మ చనిపోయారు. మరోవైపు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 9మంది మృతదేహాలకు అర్ధరాత్రి పోస్ట్‌‌మార్టం నిర్వహించి తెల్లవారు జామున 4 గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒకే రోజు 9 మందిని కోల్పోవడం చాలా బాధాకరమని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. మృతుడు వెంకటప్ప చాలా మంచి వాడని అందరితో కలసి మెలసి ఉండేవారని ఇలాంటి వ్యక్తి మృతి చెందడం చాలా బాదాకరం అన్ని స్నేహితులు రోదిస్తూ తెలిపారు.