Corona Vaccine: భారత్‌లో మరో కరోనా వ్యాక్సిన్.. సింగిల్-డోస్‌ చాలు

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఒక్క డోస్ కరోనా వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వచ్చింది.

Corona Vaccine: భారత్‌లో మరో కరోనా వ్యాక్సిన్.. సింగిల్-డోస్‌ చాలు

Sputnik V

Corona Vaccine: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఒక్క డోస్ కరోనా వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వచ్చింది. అత్యవసర ఉపయోగం కోసం ప్రభుత్వం సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఉపయోగం కోసం అనుమతించబడిన ప్రపంచ వ్యాక్సిన్‌. స్పుత్నిక్ లైట్ అత్యవసర ఉపయోగం కోసం అనుమతించబడిన తొమ్మిదవ వ్యాక్సిన్.

Schools ReOpen: కరోనా తగ్గుముఖం.. పలు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం

రెండు రోజుల క్రితం.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నిపుణుల ప్యానెల్ యాంటీ-కోవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్ పరిమిత అత్యవసర వినియోగాన్ని సిఫార్సు చేసింది. ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఈ వ్యాక్సిన్ని భారత్‌లో వేయనుంది. స్పుత్నిక్ లైట్ అర్జెంటీనా, రష్యాతో సహా 29 దేశాలలో గుర్తింపు పొందింది.

రష్యా ఆమోదించిన స్పుత్నిక్- V వ్యాక్సిన్ లైట్ వెర్షన్, ఈ వ్యాక్సిన్ ఒక మోతాదు చాలు.. కరోనా వైరస్‌పై పనిని చేస్తుంది. కరోనా వైరస్‌కి ఇప్పటివరకు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంది. స్పుత్నిక్ లైట్ వెర్షన్ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా 79.4% ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని ధర 730 రూపాయల కంటే తక్కువే ఉండొచ్చు.

Film Industry Issues : రేపే సినీ పెద్దలతో మెగాస్టార్ భేటీ..

జనవరి 2021లో కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లను అత్యవసర ఉపయోగం కోసం మొదట ఆమోదించగా.. దీని తర్వాత, మరో ఆరు వ్యాక్సిన్‌లకు అత్యవసర అనుమతి లభించింది. ఇప్పుడు తొమ్మిదవ వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్ అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఇదే తొలి సింగిల్ డోస్ వ్యాక్సిన్.

వాస్తవానికి, గత ఏడాది అక్టోబర్ 10న, రష్యా సింగిల్ డోస్ యాంటీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ స్పుత్నిక్ లైట్‌కు దేశంలో ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్ లైట్‌ను బుస్టర్ డోస్‌గా వినియోగించుకునేందుకు అనుమతి కోరింది డాక్టర్ రెడ్డీస్ సంస్థ.