Film Industry Issues : రేపే సినీ పెద్దలతో మెగాస్టార్ భేటీ..

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని అంశాలు వివరించారు చిరంజీవి. టిక్కెట్ల వ్యవహారం, థియేటర్‌ యజమానుల ఇబ్బందులు, సినీ కార్మికుల కష్టాలతోపాటు ఇండస్ట్రీ...

Film Industry Issues : రేపే సినీ పెద్దలతో మెగాస్టార్ భేటీ..

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi Meeting : సినీ ఇండస్ట్రీ పెద్దలతో ఇవాళ జరగాల్సిన మెగాస్టార్‌ భేటీ వాయిదా పడింది. ఈ సమావేశం రేపు జరుగనుంది. ఇండస్ట్రీ పెద్దన్న పాత్ర తనకు వద్దంటూనే.. బాధ్యతలు తీసుకుంటున్న చిరంజీవి.. ఇండస్ట్రీ ముఖ్యులతో 2022, ఫిబ్రవరి 08వ తేదీ మంగళవారం భేటీ కానున్నారు. సినిమా టిక్కెట్ల వ్యవహారం మొదలు థియేటర్ల అంశాల వరకు అన్నీ ఈ సమావేశంలో చర్చించనున్నారు. మళ్లీ ఏపీ సీఎం జగన్‌తో జరిగే భేటీలో ఏయే అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలన్నదానిపై చర్చించనున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అన్ని సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. మెగాస్టార్ చిరంజీవి… ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించిన విషయాలపై క్లారిటీ ఇవ్వనున్నారు.

Read More : Muchintal : శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలు.. ముచ్చింతల్‌‌కు సీఎం జగన్

గతంలో జగన్‌తో జరిగిన లంచ్‌ భేటీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని అంశాలు వివరించారు చిరంజీవి. టిక్కెట్ల వ్యవహారం, థియేటర్‌ యజమానుల ఇబ్బందులు, సినీ కార్మికుల కష్టాలతోపాటు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇతరత్రా సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీఎం జగన్‌ కూడా సానుకూలంగా స్పందించారని చిరంజీవి తెలిపారు. త్వరలోనే ఇండస్ట్రీ కష్టాలన్నీ గట్టెక్కుతాయని.. అప్పటి వరకు ఎవరూ నోరు జారవద్దని కూడా ఇండస్ట్రీ వారిని హెచ్చరించారు మెగాస్టార్‌.

Read More : Swami Paripurnananda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుంది: పరిపూర్ణానంద

సీఎం జగన్‌తో చర్చలు..సానుకూల స్పందనపై ఇప్పటి వరకు చిరంజీవితో పాటుగా నాగార్జున ఓపెన్ గానే హర్షం వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు సినీ పెద్దల సమావేశంలో చిరంజీవి పాత్ర ఆసక్తికరంగా మారబోతోంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తమ నివేదిక ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించేలోగా… టాలీవుడ్ ప్రముఖలతో జరిగే సమావేశం పైన అటు రాజకీయంగా… ఇటు సినీ పరిశ్రమలోనూ ఆసక్తి నెలకొని ఉంది.