Muchintal : శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలు.. ముచ్చింతల్‌కు సీఎం జగన్
ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి.. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి ఏడున్నర వరకు...

Jagan
Andhra Pradesh CM Jagan : ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ప్రముఖులు పాల్గొంటున్నారు. కులం, మతం, విశ్వాసాల్లో నిజమైన సమానత్వాన్ని ప్రోత్సాహించాలన్న శ్రీరామానుజ బోధనలు స్మరించుకుంటూ… 216 అడుగులు ఎత్తైన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోకార్పణ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. 2022, ఫిబ్రవరి 07వ తేదీ సోమవారం రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు.
Read More : Vishnu Vishal : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో విష్ణు విశాల్, గుత్తా జ్వాలా
అక్కడి నుంచి 3.50కి బయలుదేరి సాయంత్రం నాలుగున్నరకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి.. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి ఏడున్నర వరకు అక్కడే ఉంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గన్నవరం, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లనున్నారు జగన్.
Read More : Telangana CM KCR : కేసీఆర్ జిల్లాల పర్యటన.. రోడ్ మ్యాప్ రెడీ
సోమవారం కూడా ముచ్చింతల్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టియాగం నిర్వహిస్తారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించనున్నారు. వీటితోపాటు ప్రముఖులచే ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగనున్నాయి. ఈ ఉదయం 9 గంటలకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారు యాగశాల నుంచి రుత్విజ్ఞులతో కలిసి ర్యాలీగా సమతామూర్తి ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం సమతామూర్తి ప్రాంగణంలోని దివ్య దేశాలకు ప్రాణ ప్రతిష్ట చేస్తారు.