SI Beats Young Man : కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. లాఠీతో యువకుడిని చితకబాదిన ఎస్ఐ

లాక్ డౌన్ నిబంధనల పేరుతో పలువురు పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. రూల్స్ పేరుతో కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో బయట కనిపించిన వారి పట్ల పోలీసులు దురుసుగా

SI Beats Young Man : కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. లాఠీతో యువకుడిని చితకబాదిన ఎస్ఐ

Si Beats Young Man

SI Beats Young Man Brutally : లాక్ డౌన్ నిబంధనల పేరుతో పలువురు పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. రూల్స్ పేరుతో కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో బయట కనిపించిన వారి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కారణం ఏంటో తెలుసుకోకుండానే కోపంతో ఊగిపోతూ లాఠీలతో గొడ్డుని బాదినట్టు బాదేస్తున్నారు.

తాజాగా కడప నగరంలో ఓ ఎస్ఐ తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ యువకుడిని చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడిని ఎస్ఐ కొడుతున్న దృశ్యాలు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ నెల 25న కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో ఓ యువకుడు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా కడప 2టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జీవన్‌రెడ్డి కనిపించారు. ఎస్ఐని చూసిన యువకుడు భయపడ్డాడు. వాహనాన్ని వెనక్కి తిప్పి కొద్ది దూరం వెళ్లాడు. కంగారులో అదుపు తప్పి కిందపడ్డాడు. వెంటనే అక్కడికి వచ్చిన ఎస్ఐ అతన్ని లాఠీతో చితకబాదాడు. యువకుడు ఎస్ఐ కాళ్లు పట్టుకున్నా వదిలి పెట్టలేదు. దీంతో ఆ యువకుడి ఒళ్లంతా గాయాలయ్యాయి. ఈ వీడియో బయటకు రావడంతో దుమారం రేగింది. విషయం తెలుసుకున్న ఎస్పీ అన్బురాజన్‌ విచారించారు. ఎస్ఐ తీరుని తప్పుపట్టారు. ఎస్ఐపై యాక్షన్ తీసుకున్నారు. ఆయనను వీఆర్‌కు బదిలీ చేశారు.