వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు : హత్య జరిగిన రోజు బీటెక్ రవిని కలిసిన పరమేశ్వర్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కొమ్మ పరమేశ్వర్ రెడ్డి..టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవిని కలిసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 12:17 PM IST
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు : హత్య జరిగిన రోజు బీటెక్ రవిని కలిసిన పరమేశ్వర్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కొమ్మ పరమేశ్వర్ రెడ్డి..టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవిని కలిసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొమ్మ పరమేశ్వర్ రెడ్డి..టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవిని కలిసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వివేకా హత్య జరిగిన మార్చి 14వ తేదీ రాత్రి ఎమ్మెల్సీ బీటెక్ రవిని పరమేశ్వర్ రెడ్డి కలిసినట్లుగా నిర్ధారించారు. అదే రోజు కడపలోని ఓ ఆస్పత్రిలో పరమేశ్వర్ రెడ్డి చికిత్స చేయించుకున్నట్లు నిర్ధారించారు.

వివేకా హత్య జరిగిన రోజు పరమేశ్వర్ రెడ్డి ఓ ఆస్పత్రిలో గుండెనొప్పికి చికిత్స చేయించుకున్నట్లు నిర్ధారించారు. మార్చ్ 14న హరిత హోటల్ లో రూమ్ నెంబర్ 114లో బీటెక్ రవి బస చేశారు. బీటెక్ రవి, పరమేశ్వర్ రెడ్డి ఏం చర్చించారనే దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే బీటెక్ రవిని కలిశాక పరమేశ్వర్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లాడా లేక ఆస్పత్రికి వెళ్లి వచ్చాక టీటెక్ రవిని కలిశాడా అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

హరిత హోటల్ లో వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయంపై సిట్ దృష్టి పెట్టింది. మరోవైపు హరిత హోటల్ లో సిట్ సోదాలు నిర్వహించింది. హోటల్ లోని రికార్డులను సిట్ అధికారులు పరిశీలించారు. హరిత హోటల్ సీసీ ఫుటేజీ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.

మూడు రోజులుగా హరిత హోటల్ లో అధికారులు పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు గతం నుంచి కొమ్మ పరమేశ్వర్ రెడ్డిని అనుమానిస్తున్నారు. ఈ కేసులో పరమేశ్వర్ రెడ్డిని కీలక నిందితుడిగా భావిస్తున్నారు.