Somireddy Chandramohan Reddy : లోకేష్ పప్పు కాదు దుర్మార్గుల పాలిట నిప్పు.. వైసీపీ శ్రేణులకు కలలో కనిపిస్తున్నాడు : సోమిరెడ్డి
లోకేష్ పాదయాత్ర.. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలాగా గ్రాఫిక్స్ కాదని పేర్కొన్నారు. లోకేష్ విద్యావంతుడు.. ఒక ముఖ్యమంత్రి మనవడు, మరో ముఖ్యమంత్రి కొడుకు అని వెల్లడించారు.

Somireddy Chandramohan Reddy
Somireddy Criticize Anil Kumar : లోకేష్ వైసీపీ వాళ్ళకి కలలో కనిపిస్తున్నాడని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. లోకేష్ పప్పు కాదు దుర్మార్గుల పాలిట నిప్పు అని తెలిపారు. లోకేష్ పై మాజీ మంత్రి అనీల్ కుమార్ చేసిన విమర్శలపై సోమిరెడ్డి స్పందించారు. ఈ మేరకు సోమిరెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. విహార యాత్ర చేసింది లోకేష్ కాదని.. జగన్ అని విమర్శించారు. వారానికి నాలుగు రోజులు విహార యాత్ర చేసింది జగన్ అని వెల్లడించారు.
జగన్ వారానికి 40 కిలోమీటర్లు మాత్రమే నడిస్తే.. లోకేశ్ వారానికి 100 కిలోమీటర్లు నడుస్తున్నాడని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నీటి పారుదల శాఖను పడుకోబెట్టిందని ఎద్దేవా చేశారు. 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కు టీడీపీ ఎంత ఖర్చు చేసిందో.. వైసీపీ ఎంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము 70 శాతం పూర్తి చేసిన పెన్నా బ్యారేజీలకు 30 శాతం పూర్తి చేసి రంగులేసుకున్నారని ఎద్దేవా చేశారు.
Anil Kumar Yadav : సొంతపార్టీ నాయకులపై అనిల్ కుమార్ తీవ్ర విమర్శలు
నెల్లూరు నగరంలో చేసిన భూగర్బ డ్రైనేజీని రూ.1100 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తే.. వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూర్తి చేయలేకపోయారని అనిల్ కుమార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “మీకు బల్లాల దేవ, బాహుబలి రాజమాత గురించి చర్చించుకోవడానికే చరిపోతుంది.. నువ్వో, బాబాయ్.. ఎవరో పోటీలో ఉండేది ముందు నిర్ణయించుకోండి” అని తెలిపారు.
లోకేష్ పాదయాత్ర.. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలాగా గ్రాఫిక్స్ కాదని పేర్కొన్నారు. లోకేష్ విద్యావంతుడు.. ఒక ముఖ్యమంత్రి మనవడు, మరో ముఖ్యమంత్రి కొడుకు అని వెల్లడించారు. రాష్ట్రంలో ఎల్ఈడి బల్బులు, మరుగుదొడ్లు, ఐటీ కంపెనీలు, రోడ్లు చూస్తే లోకేష్ గుర్తుకొస్తారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి నెల్లూరు నగరంలో నిర్మించిన అధునాతన ఇళ్లను పేదలకు ఇచ్చే మనస్సు లేదని విమర్శించారు.
నెల్లూరు నగరంలో జరిగిన అభవృద్ధిపై వైట్ పేపర్ రిలీజ్ చెయ్యగలవా? అని ప్రశ్నించారు. ఇరిగేషన్ బిల్లులు రావాలంటే 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ లంచాలకు నిలయంగా మారిందని విమర్శించారు. చేతులు తడిపితే గానీ కాంట్రాక్టర్ల బిల్లులు కావడం లేదన్నారు.