Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌తో సోము వీర్రాజు భేటీ, బద్వేల్‌ ఉప ఎన్నికపై చర్చ

కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికపై బీజేపీ, జనసేన మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి. జనసేన కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు.

Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌తో సోము వీర్రాజు భేటీ, బద్వేల్‌ ఉప ఎన్నికపై చర్చ

Janasena (1)

Somu Veerraju meets Pawan Kalyan : కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికపై బీజేపీ, జనసేన మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి. జనసేన కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. ఎవరు పోటీ చేయాలన్న అంశంపై చర్చించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేసినందున.. బద్వేల్‌ శాసనసభను తమకు ఇవ్వాలని జనసేన నేతలు కోరారు.

పవన్ తో సోము వీర్రాజు భేటీ ముగిసింది. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు సోము వీర్రాజు తెలిపారు. బద్వేల్ లో ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉంటారని చెప్పారు. ఎవరు పోటీ చేయాలన్న దానిపై త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. గంటన్నరపాటు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లతో సోము వీర్రాజు, ముధుకర్ లు చర్చలు జరిపారు.

Badvel Bypoll : బద్వేల్ ఉపఎన్నిక.. వైసీపీ అభ్యర్థిగా సుధ

ఎటువంటి నిర్ణయం ప్రకటించకుండానే సోము వీర్రాజు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అయితే మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి బద్వేల్ లో పోటీ చేస్తారని చెప్పారు. పోటీ అయితే ఖాయమని క్లారిటీ ఇచ్చారు. మంచి నిర్ణయం ప్రకటిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ చేయకుండా వదలి పెట్టబోమనే సంకేతాలు ఇచ్చారు.

కాగా బీజేపీ అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే జనసేన పోటీ చేయాలని అనుకున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పోటీ చేయాలని భావిస్తోంది. దానికి సంబంధించి అసలు ఎవరి అభ్యర్థి పోటీలో ఉంటాడు… ఏ పార్టీ తరపున అభ్యర్థి ఉండాలి అన్న అంశాలపై రాత్రికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.