Dasara Festivities : అన్నపూర్ణా దేవిగా, శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు అభయమిస్తున్న జగన్మాత కనకదుర్గమ్మ

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజున ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీకనకదుర్గ అమ్మవారు  ఈరోజు ఉదయం అన్నపూర్ణ దేవి గానూ.. మధ్యాహ్నం శ్రీ మహాలక్ష్మీ దేవి గానూ భక్తు

Dasara Festivities : అన్నపూర్ణా దేవిగా, శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు అభయమిస్తున్న జగన్మాత కనకదుర్గమ్మ

Dasara 5th Day

Dasara Festivities : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజున ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీకనకదుర్గ అమ్మవారు  ఈరోజు ఉదయం అన్నపూర్ణ దేవి గానూ.. మధ్యాహ్నం శ్రీ మహాలక్ష్మీ దేవి గానూ భక్తులకు  దర్శనమివ్వనున్నారు. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలోను భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నపూర్ణాదేవి గా దర్శనమిచ్చే అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైన అలంకారం .

శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమచేతిలో ఉన్న బంగారుపాత్రలో ఉన్న అమృతాన్నము, వజ్రాలు పొదిగిన గరిటతో తన భర్త అయిన ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము. సర్వపుణ్య ప్రదాయకము.

లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మిన్న ఏదిలేదు. ఈ నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న శ్రీ దుర్గమ్మని దర్శించి తరించటం వలన అన్నాదులకు లోటు లేకుండా ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతారు.

ఇక మధ్యాహ్నం  నుంచి  శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీమహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు.  జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్టసంహారం చేసి, లోకాలు కాపాడినట్లు చెబుతున్న పురాణాలు  ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీ అన్నపూర్ణా స్తోత్రం

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ।
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 1 ॥

నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ ।
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 2 ॥

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ ।
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 3 ॥

కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ ।
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 4 ॥

దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞాన-దీపాంకురీ ।
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 5 ॥

ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ ।
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 6 ॥

ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ ।
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 7 ॥

దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ ।
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 8 ॥

చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 9 ॥

క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ ।
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 10 ॥

అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే ।
జ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ ॥ 11 ॥

మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః ।
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం ॥ 12 ॥

సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే ।
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే ॥ 13 ॥

శ్రీ మహాలక్ష్మ్యష్టకం

ఇంద్ర ఉవాచ –
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥

సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి ।
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే ।
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8 ॥

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ।
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ ।
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥

[ఇంద్రకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం]