Stone Pelting Vande Bharat Train : విశాఖలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
ఏపీలో వెర్షన్-2 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. విశాఖ కంచరపాలెంలో రామ్మూర్తిదంపతులుపేట వద్ద నిలిపి ఉంచిన రైలుపై ఆకతాయిలు రాళ్ల దాడి చేశారు.

Stone Pelting Vande Bharat Train : ఏపీలో వెర్షన్-2 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. విశాఖ కంచరపాలెంలో రామ్మూర్తిదంపతులుపేట వద్ద నిలిపి ఉంచిన రైలుపై ఆకతాయిలు రాళ్ల దాడి చేశారు. ఎక్స్ ప్రెస్ కోచ్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నాయి. రెండు కోచ్ ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఇది గమనించిన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రైలుపై రాళ్ల దాడికి పాల్పడిన ఆకతాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాళ్ల దాడిని వాల్తేరు డివిజన్ అధికారులు ధృవీకరించారు.
ట్రయల్ రన్ లో భాగంగా వందే భారత్ రైలు విశాఖకు వచ్చింది. రైలు చెన్నై నుంచి విశాఖకు వచ్చింది. ఈ నెల 19న వెర్షన్-2 వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ రైలు సికింద్రాబాద్-విశాఖ మధ్య నడవనుంది.