రాజధాని తరలింపు అసాధ్యం : మోడీ చూస్తూ ఊరుకోరు

ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూడు రాజధానులు ఖాయం అని వైసీపీ నేతలు అంటుంటే.. రాజధాని

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 09:12 AM IST
రాజధాని తరలింపు అసాధ్యం : మోడీ చూస్తూ ఊరుకోరు

ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూడు రాజధానులు ఖాయం అని వైసీపీ నేతలు అంటుంటే.. రాజధాని

ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూడు రాజధానులు ఖాయం అని వైసీపీ నేతలు అంటుంటే.. రాజధాని తరలింపు అసాధ్యం అని బీజేపీ నేతలు అంటున్నారు. రాజధాని మార్పుపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మరోసారి స్పందించారు. జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజధాని తరలింపు అసాధ్యం అని సుజనా చౌదరి తేల్చి చెప్పారు. రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం రాజధాని తరలించాలని చూస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని సుజనా చౌదరి హెచ్చరించారు.

sujana

రాజధాని కోసం న్యాయపోరాటం:
అలాగే సీఆర్డీఏ చట్టం తొలగిస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని సుజనా చౌదరి చెప్పారు. మనీ బిల్లుగా సీఆర్డీఏని తీసుకొస్తామంటే అది జరిగే పని కాదన్నారు. శివరామకృష్ణ కమిటీ కేవలం రికమండేటరీ కమిటీ తప్ప.. మ్యాండేటరీ కమిటీ కాదన్నారు. కేంద్రం రాజధానికి ఎలా సహకరించాలనేది విభజన చట్టంలో ఉందన్నారు సుజనా చౌదరి. గెలిచాం కదా అని ఇష్టానుసారం చేస్తామంటే ఎవరూ ఒప్పుకోరని అన్నారు. అమరావతి రాజధాని కోసం ప్రజా ఉద్యమమే కాదు..న్యాయపరంగానూ ముందుకెళ్తామని సుజనా చౌదరి చెప్పారు. అమరాతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న జగన్ ప్రభుత్వం.. విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

protests

32వ రోజుకు ఆందోళనలు:
రాజధాని తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతిలో ఆందోళనలు 32వ రోజుకు(జనవరి 18,2020) చేరాయి. అన్ని గ్రామాల్లో ప్రజలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం(జనవరి 18) టీడీపీ అధినేత చంద్రబాబు సహా జేఏసీ నేతలు పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర చేపట్టనున్నారు. రాజధాని తరలింపుపై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్‌తో పాటు అసెంబ్లీ భేటీకి సమయం సమీపిస్తున్న తరుణంలో అమరావతి గ్రామాల్లో ఉద్యమం ఉధృతమైంది. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలతో రైతులు హోరెత్తిస్తున్నారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటాయి.

Also Read : హే సాయి : సాయిబాబా జన్మస్థలం ఎక్కడ? షిర్డీనా ? పాథ్రీనా?