YS Viveka Murder Case : వైఎస్ వివేకా కేసు మరో రాష్ట్రానికి బదిలీపై రేపు సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు..!

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడంపై మంగళవారం సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు లేదా ఢిల్లీకి కేసు దర్యాప్తును బదిలీ చేసే అవకాశం ఉంది.

YS Viveka Murder Case : వైఎస్ వివేకా కేసు మరో రాష్ట్రానికి బదిలీపై రేపు సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు..!

YS Viveka Murder Case

YS Viveka Murder Case : మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడంపై మంగళవారం సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు లేదా ఢిల్లీకి కేసు దర్యాప్తును బదిలీ చేసే అవకాశం ఉంది.

తన తండ్రి హత్య కేసు ఇతర రాష్ట్రానికి బదిలీ చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వివేకా కుమార్తె సునీతా రెడ్డి. అక్టోబర్ 19న ఇతర రాష్ట్రానికి కేసు బదిలీ చేయడానికి అంగీకరించి తీర్పు రిజర్వ్ చేసింది జస్టిస్ ఎం.ఆర్ షా, జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ తో కూడిన ధర్మాసనం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసు దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారని, ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సునీతా రెడ్డి కోరగా, సుప్రీంకోర్టు అందుకు అంగీకరించింది.

కేసు దర్యాప్తును విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో, నిర్ణీత కాల వ్యవధిలో దర్యాప్తు పూర్తయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు సునీతా రెడ్డి. ఇప్పటికే కేసు దర్యాప్తు బదిలీపై తమకు అభ్యంతరం లేదని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపాయి.