రాజధాని రైతులకు తీపి కబురు : కౌలు నిధుల విడుదల

  • Published By: madhu ,Published On : June 22, 2020 / 05:49 AM IST
రాజధాని రైతులకు తీపి కబురు : కౌలు నిధుల విడుదల

ఏపీ రాష్ట్రంలో రాజధాని రైతులకు సీఎం జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. రాజధాని నిర్మాణం కోసం భూమిలు ఇచ్చి త్యాగం చేసిన రైతులకు కౌలు విడుదల చేసింది. వార్షిక కౌలు కింద…రూ. 190 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది.

ఈ మేరకు 2020, జూన్ 22వ తేదీ సోమవారం మున్సిపల్ శాఖ జీవోలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత..రైతులకు కౌలు విడుదల చేయడం ఇది రెండోసారి. ప్రస్తుతం విడుదల చేసిన కౌలులో మంగళగిరి నియోజకవర్గం పరిధిలోనే 900 మంది రైతులకు లబ్ది చేకూరనుంది.

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్, ఇతరత్రా సమస్యలు ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయా రంగాలకు చెందిన వారికి నిధులు విడుదల చేశారు సీఎం జగన్. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఆదుకుంటుందని సీఎం జగన్ భరోసా ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే..రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే, కౌలు విడుదల చేస్తూ పురపాలకశాఖ జారీ చేసిన ఉత్తర్వులు రైతులకు ఊరట నిచ్చాయి.

ఇటీవలే జరిగిన ఏపీ శాసనసభలో సీఆర్డీఏ, పరిపాలనా వికేంద్రీకరణలపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో..రాజధాని తరలింపు ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో రాజధానుల ఏర్పాటు మాత్రం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. 

Read: police ఇన్సెక్టర్ నని యువతిని నమ్మించి..లక్షలు దోచేసిన ఘరానా బుల్లోడు