Nara Bhuvaneswari : చంద్రబాబు ధైర్యవంతుడు, మీ కుట్రలు ఫలించవు, భోంచేయడానికి టేబుల్ కూడా ఇవ్వలేదు- నారా భువనేశ్వరి

మీరు మర్చిపోతున్నారు. చంద్రబాబుని ఎవరూ మానసికంగా క్షోభ పెట్టలేరు. ఆయన ధైర్యంగా ఉంటారు. Nara Bhuvaneswari

Nara Bhuvaneswari : చంద్రబాబు ధైర్యవంతుడు, మీ కుట్రలు ఫలించవు, భోంచేయడానికి టేబుల్ కూడా ఇవ్వలేదు- నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari -Chandrababu Arrest

Nara Bhuvaneswari -Chandrababu Arrest : చంద్రబాబు చాలా ధైర్యవంతుడు అని, ఆయనను మానసికంగా హింసించేందుకు ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని నారా భువనేశ్వరి అన్నారు. జైల్లో చంద్రబాబుని కలిసి బయటకు వచ్చాక నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు. జైల్లో చంద్రబాబు ఎదుర్కొంటున్న పరిస్థితిపై ఆమె హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు భోజనం చేయడానికి కనీసం టేబుల్ కూడా ఇవ్వలేదని భువనేశ్వరి వాపోయారు. టేబుల్ కోసం కూడా లాయర్ ద్వారా లెటర్ పెట్టాల్సి వచ్చిందన్నారు.

కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక లాంటి వారిని నారా భువనేశ్వరి అన్నారు. వారు లేకపోతే టీడీపీ లేదన్నారామె. చంద్రబాబు కోసం మహిళలు కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారని చెప్పారు.

”కార్యకర్తలు మా బిడ్డలతో సమానం. వాళ్లు లేకపోతే పార్టీ లేదు. చంద్రబాబు కోసం మహిళా లోకం కదిలింది. చంద్రబాబు భోజనం చేయడానికి జైల్లో కనీసం టేబుల్ కూడా ఇవ్వలేదు. టేబుల్ కోసం కూడా లాయర్ ద్వారా లెటర్ పెట్టాల్సి వచ్చింది. మీరు మర్చిపోతున్నారు. చంద్రబాబుని ఎవరూ మానసికంగా క్షోభ పెట్టలేరు. ఆయన ధైర్యంగా ఉంటారు. మెంటల్ గా కానీ, ఫిజికల్ గా కానీ చాలా స్ట్రాంగ్ పర్సన్” అని నారా భువనేశ్వరి అన్నారు.

Also Read..YCP MLAs: జగన్ పెట్టిన టెస్ట్‌లో పాసయ్యేదెవరు, ఫెయిలయ్యేదెవరు?

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంబసభ్యులు సోమవారం(సెప్టెంబర్ 25) ములాఖత్ అయ్యారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి జైలుకి వెళ్లి చంద్రబాబుని కలిశారు. వీరితో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.

”చిల్లర పనులతో చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేయలేరు. తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టిన ప్రభుత్వం ఆయన భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు భోజనం చేసేందుకు చిన్నపాటి సౌకర్యం కల్పించలేదు. అడ్వకేట్ లెటర్ పెట్టిన తర్వాతే ఆయనకు టేబుల్ ఏర్పాటు చేశారు. చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉన్నారు.

 

టీడీపీ అంటే ఒక కుటుంబం. కార్యకర్తలు మా బిడ్డలు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారు. నిరసనల్లో మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు స్ట్రాంగ్ పర్సన్. ఆయనను ఎవరూ కూడా మానసిక క్షోభకు గురి చేయలేరు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను సైతం అనుమతించకుండా ప్రభుత్వం అణచివేస్తుంది.

Also Read..Visakha East: విశాఖ తూర్పు నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్.. ఎమ్మెల్యేగా ఎంపీకి చాన్స్!

కార్యకర్తలు మా బిడ్డలతో సమానం. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కోసం నేడు హింసకు గురవుతున్నారు. అక్రమ కేసులకు గురై జైలుకెళ్తున్నారు. రాష్ట్రంలో నేటి లీడర్ షిప్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఘటనలే నిదర్శనం. టీడీపీ కార్యకర్తలైన మా బిడ్డలు పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లు. వాళ్లే లేకుంటే పార్టీ లేదు. పోలీసులు ఏం చేసినా మా బిడ్డలు బెదరరు. టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరం” అని నారా భువనేశ్వరి వాపోయారు.