AP Bandh : రేపు రాష్ట్ర బంద్.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్

రేపు(అక్టోబర్ 20,201) రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్

AP Bandh : రేపు రాష్ట్ర బంద్.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్

Ap Bandh

AP Bandh : రేపు(అక్టోబర్ 20,201) రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై దాడి సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది టీడీపీ. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు…. తాను సాధారణంగా బంద్ లకు పిలుపు ఇవ్వనని, కానీ నేడు జరిగిన ఘటనలతో బంద్ కు పిలుపు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. ఏనాడూ రాష్ట్రంలో 356 ఆర్టికల్ అమలు చేయాలని తమ పార్టీ గతంలో ఎప్పుడూ కోరలేదని, కానీ ఇవాళ్టి ఘటనల నేపథ్యంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముందో చెప్పాలని అన్నారు. గతంలో ఎక్కడైనా 356 ఆర్టికల్ అమలు చేసి ఉంటే, ఇంతకంటే బలమైన కారణాలు అక్కడ ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యంపైన జరిగిన దాడి కాదా? ప్రతి ఒక్క పార్టీ కూడా మాకు మద్దతివ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Free Wi-Fi: ఉచిత వైఫై వాడుతున్నారా? రిస్క్ చేస్తున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త!!

ఏపీలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ నేత పట్టాభిరామ్ ఇల్లు, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులపై దాడి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేగింది. ఈ దాడులు చేసింది వైసీపీ కార్యకర్తలే అని టీడీపీ ఆరోపిస్తోంది. దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ.

టీడీపీ, వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఆవేశాలకు గురికావొద్దని, అందరూ సంయమనం పాటించాలని ఏపీ డీజీపీ కార్యాలయం కోరింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

WhatsApp self-chat: చిన్న ట్రిక్‌తో వాట్సప్‌లో సెల్ఫ్ మెసేజ్!

విజయవాడలోని పట్టాభి ఇంటిపై దాడి జరిగింది. సామగ్రి, కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ఉద్దేశించి పట్టాభి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై పట్టాభి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సీఎం జగన్ పై పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా పలు జిల్లాల్లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ క్రమంలో పట్టాభి ఇంటిపైన, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపైనా దాడులు జరిగాయి. ఆ దాడులు చేసింది వైసీపీ శ్రేణులే అని టీడీపీ నేతలు అంటున్నారు.

రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ నేపథ్యంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా దాడి జరిగింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లను కూడా ముట్టడించారు. కేంద్ర కార్యాలయంపై దాడి అనంతరం.. అక్కడికి చేరుకొని టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. ఘటనకు సంబంధించి పార్టీ శ్రేణులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ దాడులకు నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది.

రాష్ట్రంలో టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై ఒక్కసారిగా దాడులు జరుగుతుండడం పట్ల పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో పట్టాభి నివాసంపై దాడి, మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం ధ్వంసంతో పాటు హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఇంటి ముట్టడి, పలు జిల్లాల్లో దాడులకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

కేంద్ర హోంశాఖ వర్గాలతోనూ చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయంటూ, ఇవాళ్టి ఘటనలను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కేంద్ర బలగాల సాయం కోరారు. పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మంగళగిరి దగ్గర జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు జీర్ణించుకోలేక వైసీపీ శ్రేణులు ఈ దాడులకు తెగబడుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.