Devineni Uma: మైలవరాన్ని రెవిన్యూ డివిజన్ చేయాలంటూ రోడ్డుపై భైఠాయించిన దేవినేని ఉమా

మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‍గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేవినేని ఉమ మైలవరంలో నిరసనకు దిగారు. మైలవరం ప్రధాన కూడలిలో వాహనాల్ని నినిలిపివేసి రోడ్డుపై భైఠాయించారు

Devineni Uma: మైలవరాన్ని రెవిన్యూ డివిజన్ చేయాలంటూ రోడ్డుపై భైఠాయించిన దేవినేని ఉమా

Uma

Devineni Uma: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు పై అధికార వైకాపా ప్రభుత్వం బుధవారం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్‌ 4 ఉదయం 9:05 నుంచి 9:45ల మధ్య కొత్త జిల్లాల అవతరణకు మహూర్తం ఖరారుచేయగా ఆమేరకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. అయితే జిల్లాలో ఏర్పాటుపై కొన్ని ప్రాంతాల్లో స్థానికులు ఆందోళనకు దిగుతున్నారు. మార్కాపురం, హిందూపురం ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించాలంటూ ఇప్పటికే డిమాండ్ వస్తుండగా..కృష్ణాజిల్లా మైలవరాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‍గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మైలవరం రెవెన్యూ డివిజన్ సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు.

Also read:AP Corona Cases List : ఏపీలో కొత్తగా 15 కరోనా కేసులు

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సైతం ఆందోళనకారులకు మద్దతు పలుకుతూ రోడ్డుపై బైఠాయించారు. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‍గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేవినేని ఉమ మైలవరంలో నిరసనకు దిగారు. మైలవరం ప్రధాన కూడలిలో వాహనాల్ని నినిలిపివేసి రోడ్డుపై భైఠాయించారు. ఈసందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ల ప్రక్రియ అశాస్త్రీయంగా, ఏకపక్షంగా, మూర్ఖంగా జరిగిందని ప్రభుత్వాన్ని విమర్శించారు. మైలవరానికి రెవెన్యూ డివిజన్ అయ్యే అన్ని అర్హతులు ఉన్నాయని ఉమా పేర్కొన్నారు. మైలవరం రెవెన్యూ డివిజన్ కావాలని అఖిలపక్ష పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో ఈప్రాంత ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేస్తే ప్రభుత్వానికి మాత్రం చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు ఉందని ఉమా అన్నారు.

Also read:Nara Lokesh: జ‌గ‌న్‌రెడ్డి మాట ఇచ్చాడంటే, దానికి రివ‌ర్స్ చేస్తాడంతే!: నారా లోకేష్

ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మైలవరం రెవెన్యూ డివిజన్ కోసం తాను మైలవరం నడిరోడ్డుపై కుర్చున్నానని అరెస్టులు, జైళ్లు కాదు అన్నిటికి సిద్ధపడే ఇక్కడ కూర్చున్నామని దేవినేని ఉమా అన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాత్రం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి.. మైలవరం రెవెన్యూ డివిజన్ కావాలని అడుక్కునే పరిస్థితిలో ఉన్నాడంటూ ఉమా విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ మూర్ఖపు నిర్ణయాలు మానేసి వెంటనే మైలవరంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

Also read:YCP MP’s Meet Modi: ఓబీసీ రిజర్వేషన్ అంశంపై ప్రధాని మోదీతో చర్చించిన వైకాపా ఎంపీలు