Nara Lokesh: జ‌గ‌న్‌రెడ్డి మాట ఇచ్చాడంటే, దానికి రివ‌ర్స్ చేస్తాడంతే!: నారా లోకేష్

క‌రెంటు చార్జీలు బాదుడే, బాదుడంటూ నాడు జ‌గ‌న్ తీసిన దీర్ఘాల స్థాయిలోనే.. ఇప్పుడు రాష్ట్రంలో మూడేళ్ల‌లో కరెంటు చార్జీలు భారీగా పెంచి జ‌నానికి షాక్ ఇస్తున్నారని లోకేష్ అన్నారు

Nara Lokesh: జ‌గ‌న్‌రెడ్డి మాట ఇచ్చాడంటే, దానికి రివ‌ర్స్ చేస్తాడంతే!: నారా లోకేష్

Loki

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంపుదలపై ప్రతిపక్ష నేత నారా లోకేష్ స్పందించారు.” ప్ర‌తిప‌క్షంలో వున్న‌ప్పుడు తన తండ్రి ఇచ్చిన‌ట్టే వ్య‌వ‌సాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానంటూ పెద్ద పెద్ద మాట‌లు చెప్పారు..అధికారం అందాక మోటార్ల‌కి మీట‌ర్లు బిగించి వ్య‌వ‌సాయానికి ఉరితాళ్లు బిగించారు” అంటూ నారా లోకేష్ సీఎం జగన్ ను విమర్శించారు. సీఎం ప‌ద‌వి కోసం జ‌గ‌న్ రెడ్డి తొక్క‌ని అడ్డ‌దారి లేదని..జ‌గ‌న్‌రెడ్డి మాట ఇచ్చాడంటే, దానికి రివ‌ర్స్ చేస్తాడంతే అంటూ నారా లోకేష్ విమర్శించారు. నాడు విప‌క్ష‌నేత‌గా పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు బాదుడే బాదుడంటూ రాగం తీసిన జ‌గ‌న్‌రెడ్డి.. నేడు ప్ర‌భుత్వాధినేత‌గా దేశంలో అత్యధికంగా పెట్రోల్‌, డీజిల్ రేట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పేరిట‌ రికార్డు నెల‌కొల్పారని లోకేష్ దుయ్యబట్టారు.

Also read:Bandla Ganesh: పవన్ పార్టీలో చిరు.. మరి నేను అంటోన్న బండ్ల గణేష్!

క‌రెంటు చార్జీలు బాదుడే, బాదుడంటూ నాడు జ‌గ‌న్ తీసిన దీర్ఘాల స్థాయిలోనే.. ఇప్పుడు రాష్ట్రంలో మూడేళ్ల‌లో కరెంటు చార్జీలు భారీగా పెంచి జ‌నానికి షాక్ ఇస్తున్నారని లోకేష్ అన్నారు. విద్యుత్ కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తిరిగి తీసుకొచ్చిన సీఎం జగన్, ఏపీలో సామాన్యులపై మోయలేని భారం వేసిందని లోకేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో 30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45 పైసలు పెంచింది. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్‌కు 91 పైసలు, 76 నుంచి 125 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.40, అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57 పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు 55 పైసలు పెంచ‌డం ఏ రేంజ్ బాదుడో జ‌గ‌న్‌రెడ్డే చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు.

Also read:YCP MP’s Meet Modi: ఓబీసీ రిజర్వేషన్ అంశంపై ప్రధాని మోదీతో చర్చించిన వైకాపా ఎంపీలు

ఒక ఏడాదిలో జ‌గ‌న్‌రెడ్డి ఇచ్చే అన్నిప‌థ‌కాల డ‌బ్బూ ఏడాది క‌రెంటు బిల్లుల‌కే స‌రిపోనంత స్థాయిలో పెర‌గ‌నుండ‌డం ఏ బాదుడో సీఎం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. టీడీపీ హ‌యాంలో క‌రెంటు చార్జీలు పెంచ‌క‌పోయినా బాదుడే బాదుడంటూ ఆనాడు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన జ‌గ‌న్‌రెడ్డి నేడు టీడీపీకి క్ష‌మాప‌ణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ప్రజలకు వేసవి షాక్ ఇచ్చిన జగన్..తక్షణమే చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Also read:AP Electricity Charges : ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీల పెంపు.. ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్