NDA Meet: టీడీపీకి ఎన్డీయే నుంచి పిలుపొచ్చిందా.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?

కొన్ని రోజుల నుంచి చంద్రబాబు వైఖరిని గమనిస్తే ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఢిల్లీకి వెళ్లి అమిత్ షాని కలిసినా ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు.

NDA Meet: టీడీపీకి ఎన్డీయే నుంచి పిలుపొచ్చిందా.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?

Narendra Modi, Chandrababu Naidu

NDA Meet – TDP : ఈ నెల 18న ఎన్డీయే కీలక సమావేశం జరగబోతోంది. ఈ మీటింగ్‌కు ఏపీ నుంచి టీడీపీ (Telugu Desam Party) హాజరవుతోందనే వార్త.. ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‌ని ఊపేస్తోంది. ఈ సమావేశం తర్వాత ఎన్డీఏలో చేరికపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కీలక ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అసలు నిజంగానే టీడీపీకి ఎన్డీయే నుంచి పిలుపొచ్చిందా? ఎందుకు.. టీడీపీ ఈ వార్తలపై స్పందించడం లేదు? చంద్రబాబు కావాలనే గోప్యత మెయింటైన్ చేస్తున్నారా? తెరవెనుక.. ఏం జరుగుతోంది?

2019 అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకొచ్చాక.. రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయ్. మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ఏపీలో బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు పొడిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయనే ప్రచారం చాలా రోజుల నుంచి నడుస్తోంది. ఈ క్రమంలో ఎన్డీయే మీటింగ్‌కు హాజరుకావాలంటూ టీడీపీకి కూడా ఆహ్వానం వచ్చిందనే వార్త.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై తెలుగుదేశం నుంచి ఎవరూ స్పందించలేదు. అదేవిధంగా ఖండించనూ లేదు. ఇదే అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజానికి ఈ రకమైన వ్యహారం తెలుగుదేశం సహజ వైఖరికి విరుద్ధంగా కనిపిస్తోంది. రాజకీయంగా ఇలాంటి ఇంట్రస్టింగ్ అంశాలుంటే తెలుగుదేశం స్పందించడమో, ఖండించడమో చేసేది. లేదంటే.. టీడీపీ వర్గాల నుంచే సమాచారం బయటకు వచ్చేది. కానీ.. ఇప్పుడు ఇవేవీ జరగట్లేదు. దాంతో ఇది నిజమా.. కాదా.. అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయ్.

కొన్ని రోజుల నుంచి చంద్రబాబు వైఖరిని గమనిస్తే ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఢిల్లీకి వెళ్లి అమిత్ షాని కలిసినా ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. తర్వాత బాబు కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు. టీడీపీ నేతల నుంచి కూడా అమిత్ షాతో బాబు భేటీకి సంబంధించి ఎలాంటి రియాక్షన్ లేదు. ఇప్పుడు.. ఎన్డీయే నుంచి పిలుపొచ్చిందన్న దాని పైనా.. తెలుగుదేశం నుంచి స్పందన లేదు. దాంతో.. చంద్రబాబు కావాలనే ఇలాంటి కీలక అంశాల్లో గోప్యత మెయింటైన్ చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ.. అదే నిజమైతే.. ఎందుకు బాబు ఇంత గోప్యంగా ఉంటున్నారనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

Also Read: వైఎస్ షర్మిల ఆస్తి పంపకాలు.. ఆ ఇద్దరికి తన ఆస్తులను రాసిచ్చింది

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు కొత్తగా కూటమిలోకి తీసుకునే వారికి.. బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ఈ క్రమంలోనే టీడీపీ సహా మరికొన్ని పార్టీలకు ఆహ్వానం అందినట్లు.. నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయ్. దాంతో.. టీడీపీ కూడా మళ్లీ ఎన్డీయేలో చేరడం ఖాయమేననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అందువల్ల.. ఏపీలో తన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ, సీఎం జగన్ అలర్ట్ అవుతారన్న ఆలోచనతోనే.. చంద్రబాబు గోప్యత మెయింటైన్ చేస్తున్నారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే.. ఈ టైపు వ్యవహారం ఇంతకుముందు టీడీపీలో ఎప్పుడూ కనిపించలేదు.

చంద్రబాబు వైఖరిలో చాలా మార్పులు.. వివరాలకు ఈ వీడియో చూడండి