TDP MP Rammohan Naidu : సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం.. పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలి

శ్రీకాకుళం జిల్లా వ్యక్తులను అవమానిస్తే ఈ ప్రాంత మంత్రులు నోరు మూసుకుంటారా? ఉత్తరాంధ్ర రాజధాని పేరిట వస్తున్నది మమ్మల్ని అవమానించటానికా? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.

TDP MP Rammohan Naidu : సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం.. పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలి

TDP MP Rammohan Naidu

Chandrababu Arrest : మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ మా అందరికి బాధాకరమైన విషయం.. తితిలీ తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలతో కలిసి బాబు దసరా జరుపుకున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గుర్తుచేసుకున్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. దేశం మొత్తం బాబు వెంట ఉన్నారు.. ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. టీడీపీ క్యాడర్ కేసులకు భయపడకుండా చంద్రబాబు అరెస్ట్ పై పోరాటం చేస్తున్నారని చెప్పారు. అయితే, పుంగనూరులో సిక్కోలు వాసులను అవమానించడం దారుణమని రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు భారతదేశంలో లేదా? అంటూ ప్రశ్నించారు.

Read Also : Nara Brahmani : కలియుగ అసురులను అంతమొందించే వరకు పోరాడుదాం! నారా బ్రాహ్మిణి ట్వీట్

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సైకిల్ యాత్ర చేస్తున్న కార్యకర్తలను అవమానిస్తారా? మా జిల్లా వాసులను బట్టలు విప్పి పెద్దిరెడ్డి అనుచరులు అవమానించారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వాసిగా నా రక్తం మరిగిపోతుంది. రాయలసీమ పరువును పెద్దిరెడ్డి తీస్తున్నాడు. పార్లమెంట్ లో మిదున్ రెడ్డి నన్ను అవమానించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు నా జిల్లా వాసులను అవమానించారు. పెద్దిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి, మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం.. నిరసన చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సైకిల్ యాత్ర చేస్తున్న బీసీ వ్యక్తులను నోటికొచ్చినట్లు మాట్లాడుతారా? జగన్, మంత్రులు ఈ ఘటనపై ఎందుకు నోరు మెదపరని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.

Read Also : Telangana BJP: బీజేపీ లో భగ్గుమన్న అసంతృప్తులు.. కమలనాథుల్లో చిచ్చురాజేసిన మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ ..

శ్రీకాకుళం జిల్లా వ్యక్తులను అవమానిస్తే ఈ ప్రాంత మంత్రులు నోరు మూసుకుంటారా? ఉత్తరాంధ్ర రాజధాని పేరిట వస్తున్నది మమ్మల్ని అవమానించటానికా? అని ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగం వద్దనుకునే విజయమ్మను వైజాగ్ ప్రజలు ఓడించారని రామ్మోహన్ నాయుడు గుర్తుచేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒక్క ఆధారం చూపించగలరా..? జగన్ అవినీతిని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తామని రామ్మోహన్ నాయుడు అన్నారు. కాలయాపన చేసి చంద్రబాబును జైలులో నిర్బంధించాలని చూస్తున్నారు. న్యాయం ఒకరోజు ఆలస్యంగా అయినా గెలుస్తుందని రామ్మోహన్ నాయుడు అన్నారు.