Chandrababu Naidu : ఏపీని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది

ఆంధ్రప్రదేశ్ లోపార్టీని అధికారంలోకి తీసుకు రావటంతో పాటు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandrababu Naidu : ఏపీని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది

Chandrababu Naidu

Updated On : March 29, 2022 / 7:55 AM IST

Chandrababu Naidu :  ఆంధ్రప్రదేశ్ లో  పార్టీని  అధికారంలోకి   తీసుకురావటంతో  పాటు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.

ఆయన నిన్నహైదరాబాద్ లో …టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రమ్మోహనరావు రచించిన నేను తెలుగుదేశం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజకీయాన్ని వ్యాపారం చేసుకుంటే అవినీతి జరుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ 100 సంవత్సరాల జయంతి వేడుకలు వచ్చే సంవత్సరంలో జరుపుతామని ఆయన చెప్పారు.

ఎన్టీ ఆర్ ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం ఆహార భద్రతకు దారి తీసింది అని… నాడు మేము చేసింది నేడు జాతికి ఆదర్శం అయ్యిందని చంద్రబాబు తెలిపారు. పార్టీ పట్ల చిత్తశుధ్ది ఉన్న ఒకే ఒక వ్యక్తి కంభపాటి రామ్మోహనరావు అని…చాలా మంది దగ్గర ఉంటే శత్రువులు అవుతారు కానీ… కంభంపాటి అలా కాదని చంద్రబాబు ప్రశంసించారు.
Also Read : Viveka murder case: వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులకు భద్రత పెంపు
తెలుగుదేశంపార్టీ ప్రజాహితం కోసం పని చేసిందని… అధికారంలోకిరావటానికి ఎప్పుడూ పని చేయలేదని అలా చేస్తే ఎప్పడూ అధికారంలోనే ఉండేవాళ్లమనవి ఆయన అన్నారు.చేసిన అభివృధ్ది నాకు ఆత్మ సంతృప్తి ఇస్తుంది అని.. ఐటీ గురించి అప్పుడే చెప్తే వైఎస్ లాంటి వాళ్లు నన్ను విమర్శించారు… పేదపిల్లల్ని ఐటీ ప్రోఫెషనల్స్ గా టీడీపీ తీర్చి దిద్దిందని చంద్రబాబు నాయుడు అన్నారు.