మండలిలో జగన్ ప్రభుత్వానికి షాక్ : రూల్ 71 ప్రయోగించిన టీడీపీ

శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న టీడీపీ..జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. టీడీపీ రూల్ 71 అస్త్రం ప్రయోగించింది. మండలిలో రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించింది.

  • Published By: veegamteam ,Published On : January 21, 2020 / 05:47 AM IST
మండలిలో జగన్ ప్రభుత్వానికి షాక్ : రూల్ 71 ప్రయోగించిన టీడీపీ

శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న టీడీపీ..జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. టీడీపీ రూల్ 71 అస్త్రం ప్రయోగించింది. మండలిలో రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించింది.

శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న టీడీపీ..జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. టీడీపీ రూల్ 71 అస్త్రం ప్రయోగించింది. మండలిలో రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించింది. రూల్ 71 ను మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు చదివి వినిపించారు. ప్రభుత్వం ఏదైనా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానిని తిరస్కరిస్తూ మోషన్ మూవ్ చేసే అధికారం ఉందని చెప్పారు. మండలిలో బిల్లులు ప్రవేశపెట్టడానికంటే ముందుగానే రూల్ 71 కింద చర్చకు టీడీపీ పట్టుపట్టింది.

కాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. మండలిలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టారు. రూల్ 71పై స్పందించిన మంత్రి బుగ్గన.. మండలిలో రూల్ 71 ప్రవేపెపెట్టే అధికారం టీడీపీకి లేదన్నారు. తామిచ్చిన నోటీసుపై చర్చ జరగాల్సిందేనని యనమల పట్టుపట్టారు.

రూల్ 71 తీర్మానంపై చర్చను ఆమోదిస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టే అవుతుందని విశ్లేషకలు చెబుతున్నారు. టీడీపీ తొలిసారి రూల్ 71 ను వినియోగించుకుంది. టీడీపీ వ్యూహంతో ప్రభుత్వం తర్జనభర్జనలో పడినట్టు తెలుస్తోంది.

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఏపీ శానససభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వికేంద్రీకరణ బిల్లు ఇవాళ శాసనమండలి ముందుకు వచ్చింది. మండలిలో మూడు రాజధానుల బిల్లు ఆమోదింప చేసుకోవడానికి అధికార పార్టీ, తిరస్కరించడానికి టీడీపీ వ్యూహాలు రచించాయి. ఇందులో భాగంగానే టీడీపీ రూల్ 71 ప్రయోగించింది.

శాసన మండలిలో సెగలు:

* రూల్ 71 కింద శాసన మండలిలో నోటీస్ ఇచ్చిన టీడీపీ
* సభలో రూల్ 71 చదివి వినిపించిన యనమల..
* మండలిలో రూల్ 71 కింద నోటీస్ ఇచ్చే అధికారం లేదన్న మంత్రి బుగ్గన 
* మండలిలో సభ్యుల మెజార్టీ లెక్కించి చర్చకు అనుమతించిన చైర్మన్
* రూల్ 71 ప్రకారం ఇచ్చే నోటీసులపై 7 రోజుల్లో చర్చ జరపవచ్చని బదులు ఇచ్చిన బుగ్గన

* తమ ఎమ్మెల్సీలకు బొత్స ఎందుకు ఫోన్లు చేస్తున్నారని ప్రశ్నించిన యనమల
* మండలిని కించ పరిచేలా బొత్స వ్యవహరిస్తున్నారని యనమల ఆగ్రహం
* తాను ఎవరికి ఫోన్ చేశానో నిరూపించాలని డిమాండ్ చేసిన బొత్స

మండలిలో నెంబర్ గేమ్:

ఏపీ శాసనమండలి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పాలనా వికేంద్రీకరణపై చర్చకు ముందే నెంబర్ గేమ్ మొదలైంది. 58మంది సభ్యులున్న పెద్దల సభలో సంఖ్యాపరంగా ప్రతిపక్షానిదే(టీడీపీ) ఆధిపత్యం. టీడీపీకి 28మంది సభ్యులు ఉండగా… అధికార పక్షం వైసీపీకి కేవలం 9మంది సభ్యులే ఉన్నారు. ఇక.. బీజేపీకి ఇద్దరు సభ్యులుండగా… ముగ్గురు ఇండిపెండెంట్లు, 8మంది నామినేటెడ్ సభ్యులు, ఐదుగురు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలున్నారు. మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

టీడీపీకి 28మంది సభ్యులతోపాటు.. నామినేటెడ్‌ సభ్యుల్లోని ఐదుగురు ఎమ్మెల్సీలు, ఇండిపెండెంట్లలోని ఓ ఎమ్మెల్సీ టీడీపీకి మద్దతిస్తున్నారు. దీంతో మొత్తంగా ఆ పార్టీ బలం 34గా ఉంది. ఇక గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కంతేటి సత్యనారాయణరాజు వైసీపీలోనే ఉండటంతో ప్రభుత్వ బలం 10కి చేరింది. నామినేటెడ్ సభ్యుల్లో ఒకరు, ఇండిపెండెంట్లలోను ఇద్దరు సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం లేకపోలేదు. అయితే.. వీరంతా కలిపినా వైసీపీకి 14మంది సభ్యుల బలం మాత్రమే దక్కుతోంది. కానీ… బిల్లును గట్టెక్కించాలంటే అధికార పక్షానికి మరో ఆరుగురు ఎమ్మెల్సీలు అవసరం. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐదుగురున్నా వారికి పార్టీలతో సంబంధం లేదు. అందుకే వీరు తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో బిల్లుల ఆమోదంపై అనుమానాలు నెలకొన్నాయి.

మండలిలో టీడీపీదే ఆధిపత్యమైనా…. డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేయడం, శమంతకమణి సభకు గైర్హాజరవడం వంటి పరిణామాలు ఆ పార్టీని టెన్షన్‌ పెడుతున్నాయి. మరోవైపు.. బిల్లుల ఓటింగ్‌ సమయానికి ఏం జరుగుతుందన్నది సస్పెన్స్‌గా మారింది.