Andhra Pradesh : జలవివాదం, కేంద్ర మంత్రులకు సీఎం జగన్ లేఖలు

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఓ కొలిక్కి రావడం లేదు. ఈ క్రమంలో..ఏపీ సీఎం జగన్ కేంద్రానికి పలు లేఖలు రాస్తున్నారు. తాజాగా..కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌లకు‌ లేఖలు రాశారు.

Andhra Pradesh : జలవివాదం, కేంద్ర మంత్రులకు సీఎం జగన్ లేఖలు

Cm Jagan

CM Jagan : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఓ కొలిక్కి రావడం లేదు. ఈ క్రమంలో..ఏపీ సీఎం జగన్ కేంద్రానికి పలు లేఖలు రాస్తున్నారు. తాజాగా..కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌లకు‌ లేఖలు రాశారు. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు పర్యావరణ అనుమతి ఇవ్వాలని మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, కేటాయింపుల కంటే ఎక్కువగానే నీటిని వినియోగిస్తోందని ప్రస్తావించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉండకుండా అక్రమంగా తోడేస్తోందని వెల్లడించారాయన.

2021, జూలై 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుందని వివరించారు. 796 అడుగుల నీటిమట్టం నుంచి తెలంగాణ రాష్ట్రం నీటిని తోడేస్తుందని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీరు లేకుంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరందించే అవకాశం లేదని ఏపీ సీఎం జగన్ లేఖలో వెల్లడించారు.

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా సీఎం జగన్ లేఖ రాశారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఫిర్యాదు చేశారు. KRMB తీరుపై లేఖలో అభ్యంతరం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తున్న కేఆర్ఎంబీ..ఏపీ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ప్రస్తావించారు. కేఆర్ఎంబీ తొలుత ప్రాజెక్టులను పరిశీలించాలని కోరారు. ఆ తర్వాతే..రాయలసీమలో పర్యటించేలా ఆదేశించాలని, కేఆర్ఎంబీ సూచనలను తెలంగాణ రాష్ట్రం పదేపదే ఉల్లంఘిస్తోందన్నారు. తెలంగాణ వైఖరితో ఏపీ తన వాటా జలాలు కోల్పోతోందని, కృష్ణా జలాలు సముద్రంలో కలుస్తున్నాయన్నారు.