AP Govt : ఏపీలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు నియామకం

గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా బొత్స సత్యనారాయణ, అనకాపల్లి ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా పి.రాజన్నదొర నియామకం అయ్యారు.

AP Govt : ఏపీలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు నియామకం

Incharge Minisrters

in charge ministers of districts : ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం జరిగింది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం(ఏప్రిల్19,2022)వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా బొత్స సత్యనారాయణ, అనకాపల్లి ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా పి.రాజన్నదొర, కాకినాడ ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా సిదిరి అప్పలరాజు, పార్వతిపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రిగా గుడివాడ అమర్నాధ్, పశ్చిమగోదావరి ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా దాడిశెట్టి రాజా, ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా పి.విశ్వరూప్‌ నియామకం అయ్యారు.

తూర్పుగోదావరి ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా తానేటి వనిత, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు, బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా కొట్టు సత్యనారాయణ, కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా రోజా, నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా అంబటి రాంబాబు, కడప ఆదిమూలపు సురేశ్ కు బాధ్యతలు అప్పగించారు.

AP New Cabinet : ఏపీ నూతన కేబినెట్ జాబితా విడుదల.. కొత్త మంత్రులు వీరే

విజయనగరం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ముత్యాలనాయుడు, అమలాపురం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా జోగి రమేశ్, అన్నమయ్య జిల్లా – కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనంతపురం జిల్లా-పెద్దిరెడ్డి, తిరుపతి- నారాయణస్వామి, నంద్యాల- అంజాద్ బాషా, కర్నూలు-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సత్యసాయి జిల్లా-జయరాం, చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉషా శ్రీ చరణ్, విశాఖ-విడదల రజనీ, ఒంగోలు-మేరుగ నాగార్జునను నియమించారు.