Supreme Court Judgment : వివేకా హత్య కేసు.. గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసును మరోసారి జరపాలని న్యాయస్థానం ఆదేశించింది.

Supreme Court Judgment : వివేకా హత్య కేసు.. గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Viveka murder case

Supreme Court Judgment : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసును మరోసారి జరపాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే కేసు ట్రయల్ తెలంగాణకు బదిలీ అయింది. గంగిరెడ్డి రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టు తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

జనవరి5, 2023న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఎర్ర గంగిరెడ్డికి ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. వివేకా హత్య కేసులో సాక్షులను గంగిరెడ్డి ప్రభావితం చేసే అవకాశం ఉందని, అయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది.

YS Viveka Reddy : వివేకా హత్య కేసులో సంచలన విషయాలు

ఇప్పటికే సుప్రీంకోర్టు వివేక హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో వివేకా కుమార్తె సునితా రెడ్డి ఇంప్లీడ్ అయివున్నారు. ఆమె అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత వాదనలు ముగిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఇన్వెస్టిగేషన్, ఆ తర్వాత సీబీఐకి బదిలీ అయింది. ఈనేళ్లుగా కేసు దర్యాప్తు కొనసాగుతుండటం, విచారణలో జాప్యం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతోనే వేగవంతంగా కేసు విచారణను పూర్తి చేసేందుకే ఈ కేసును హైదరాబాద్ కు బదిలీ చేశారు.

ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే కేసు ట్రయల్ తెలంగాణకు బదిలీ అయింది. గంగిరెడ్డి రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టు తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసును మరోసారి జరపాలని న్యాయస్థానం ఆదేశించింది. మరి తెలంగాణ హైకోర్టు తీర్పు ఇస్తుంది? గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తుందా? లేదా ? చూడాలి మరి.