Tirumala : శ్రీవారిని దర్శించుకుంటున్న వెనుకబడిన ప్రాంతాల భక్తులు.. రోజుకు వెయ్యి మంది

గతేడాది బ్రహ్మోత్సవాల నుండి 13 జిల్లాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాల భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Tirumala : శ్రీవారిని దర్శించుకుంటున్న వెనుకబడిన ప్రాంతాల భక్తులు.. రోజుకు వెయ్యి మంది

Tirumala 11zon

backward areas devotees : తిరుమలలో వెనుకబడిన ప్రాంతాల భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా గత 5 రోజులుగా రోజుకు వెయ్యి మంది వెనుకబడిన ప్రాంతాల భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల, రంపచోడవరంకు చెందిన వెయ్యి మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠద్వార ప్రవేశం చేశారు.

తిరుమలలోని భక్తులతో అదనపు ఈవో ధర్మారెడ్డి సమావేశమయ్యారు. భక్తులు హిందూ ధర్మాన్ని పాటించాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, మత్స్యకారులు నివాసముండే వెనుకబడిన ప్రాంతాల్లో 502 శ్రీవెంకటేశ్వర ఆలయాలు నిర్మించామని ధర్మారెడ్డి తెలిపారు.

Pawan Kalyan : ఏపీలో కోవిడ్ పరీక్ష కేంద్రాలు పెంచాలి : పవన్ కళ్యాణ్

గత ఏడాది బ్రహ్మోత్సవాల నుండి 13 జిల్లాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాల భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సమరసత్తా ఫౌండేషన్ ద్వారా భక్తుల నుంచి ఎంపిక చేసి దర్శనాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 13 నుండి 22 వరకు రోజుకు వెయ్యి మంది చొప్పున వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నామని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు.