Electric Shock Three Died : పురుగుల మందు పిచికారి చేస్తుండగా.. కరెంట్‌ షాక్ తో ముగ్గురు రైతులు మృతి

ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లాలో విషాదం నెలకొంది. కరెంట్‌ షాక్‌తో ముగ్గురు రైతులు మృతి చెందారు. జిల్లాలోని చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా ముగ్గురు రైతులు కరెంట్‌ షాక్‌తో మృతి చెందారు.

Electric Shock Three Died : పురుగుల మందు పిచికారి చేస్తుండగా.. కరెంట్‌ షాక్ తో ముగ్గురు రైతులు మృతి

Electric Shock Three Died : ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లాలో విషాదం నెలకొంది. కరెంట్‌ షాక్‌తో ముగ్గురు రైతులు మృతి చెందారు. జిల్లాలోని చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా ముగ్గురు రైతులు కరెంట్‌ షాక్‌తో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా ఒక రైతు పురుగుల మందు పిచికారి చేస్తుండగా అతడికి కరెంట్‌ షాక్ తగిలింది.

అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు రైతులకు కూడా కరెంట్ షాక్‌ తగిలింది. దీంతో ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Andhra Pradesh : కరెంట్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.