Srivari Special Darshan Tickets : తిరుమల ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు.. ఆన్ లైన్ లో విడుదల చేసిన టీటీడీ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదల అయ్యాయి. ఈ మేరకు శనివారం (డిసెంబర్ 24,2022)న టికెట్లను టీటీడీ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు 2.20 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.

Srivari Special Darshan Tickets : తిరుమల ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు.. ఆన్ లైన్ లో విడుదల చేసిన టీటీడీ

TIRUMALA

Srivari Special Darshan Tickets : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదల అయ్యాయి. ఈ మేరకు శనివారం (డిసెంబర్ 24,2022)న టికెట్లను టీటీడీ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు 2.20 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను కొనుగోలు చేయాలని భక్తులకు టీటీడీ సూచించింది.  అలాగే జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు.

TTD about laddu: తిరుమల శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలొద్దు: టీటీడీ

ఈ సందర్భంగా ఆ రోజున వీఐసీ బ్రేక్ దర్శనాలకు అనుమతి లేదు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26న ఎటువంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని టీటీడీ తెలిపింది. భక్తులు సహకరించాలని కోరింది.