TTD about laddu: తిరుమల శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలొద్దు: టీటీడీ

ల‌డ్డూ బ‌రువు, నాణ్య‌త విష‌యంలో కూడా ఏనాడు రాజీ ప‌డ‌లేదని టీటీడీ పేర్కొంది. సాధార‌ణంగా ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద ఏదైనా ఇబ్బంది త‌లెత్తితే వేంట‌నే అక్క‌డ అందుబాటులో ఉన్న ల‌డ్డూ కౌంట‌ర్ అధికారికి తెలియ‌జేస్తే, అక్క‌డిక్క‌డే స‌మ‌స్యను ప‌రిష్క‌రించే వ్య‌వ‌స్థ టీటీడీలో ఉందని వివరించింది. కానీ, ఓ భ‌క్తుడు ఇవేమి చేయ‌కుండా సోష‌ల్ మీడియాలో టీటీడీపై ఆరోప‌ణ‌లు చేయ‌డం శోచ‌నీయమని చెప్పింది.

TTD about laddu: తిరుమల శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలొద్దు: టీటీడీ

TTD about laddu: శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విమర్శలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివరణ ఇచ్చింది. లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దని చెప్పింది. తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాముల మధ్య బరువు ఉంటుందని ఓ ప్రకటనలో వివరించింది. ప్ర‌తి రోజు పోటు కార్మికులు త‌యారు చేసిన ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను ఒక ప్ర‌త్యేక‌ ట్రేలో ఉంచి, ప్ర‌తి ట్రే బ‌రువును పోటు అధికారులు త‌నిఖీ చేస్తారని చెప్పింది.

అనంత‌రం ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను కౌంట‌ర్ల‌కు త‌ర‌లించి, భ‌క్తుల‌కు అందిస్తారని చెప్పింది. ఇందులో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉంటుందని వివరించింది. బరువు తూచే మిషన్ లో సాంకేతిక‌ సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటం, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం కార‌ణంగా లడ్డూ బరువుపై భ‌క్తుల్లో అపోహలు నెలకొన్నాయని చెప్పింది. లడ్డూ బరువు కచ్చితంగా 160-180 గ్రాముల మధ్యే ఉంటుందని స్పష్టం చేసింది.

కొన్ని వందల సంవత్సరాలుగా అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారని చెప్పింది. అదేవిధంగా ల‌డ్డూ బ‌రువు, నాణ్య‌త విష‌యంలో కూడా టీటీడీ ఏనాడు రాజీ ప‌డ‌లేదని పేర్కొంది. సాధార‌ణంగా ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద ఏదైనా ఇబ్బంది త‌లెత్తితే వేంట‌నే అక్క‌డ అందుబాటులో ఉన్న ల‌డ్డూ కౌంట‌ర్ అధికారికి తెలియ‌జేస్తే, అక్క‌డిక్క‌డే స‌మ‌స్యను ప‌రిష్క‌రించే వ్య‌వ‌స్థ టీటీడీలో ఉందని వివరించింది. కానీ, ఓ భ‌క్తుడు ఇవేమి చేయ‌కుండా సోష‌ల్ మీడియాలో టీటీడీపై ఆరోప‌ణ‌లు చేయ‌డం శోచ‌నీయమని చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇలాంటి అపోహలను భక్తులు నమ్మవద్దని కోరింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..