Tirumala: రేపటి నుంచి తిరుమల నడకదారి మూసివేత..!

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో.. తిరుమల నడక దారిని అధికారులు మరోసారి మూసేయనున్నారు. ఈ సారి ముందే జాగ్రత్త పడిన అధికారులు.. 2 రోజుల పాటు నడక దారి మూసేస్తున్నట్టు తెలిపారు.

Tirumala: రేపటి నుంచి తిరుమల నడకదారి మూసివేత..!

Tirumala

Tirumala: బంగాళాఖాతంలో అల్పపీడనంతో.. మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు రావడంపై.. అధికారులు అప్రమత్తమయ్యారు. రేపటి నుంచి.. అంటే.. బుధవారం (నవంబర్ 17) నుంచి.. రెండు రోజుల పాటు.. తిరుపతి నుంచి తిరుమలకు నడకదారి మూసివేయనున్నారు. తిరుమల, తిరుపతికి భారీ వర్ష సూచనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్డు ప్రయాణమే సురక్షితమని అధికారులు వెల్లడించారు.

ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులో కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. నడక దారిలో అయితే.. వరద భారీగా పారింది. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు, భక్తులు.. నడక దారి మెట్లకు ఉండే గోడలను పట్టుకుని ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా నడక దారిని తాత్కాలికంగా మూసేసిన టీటీడీ.. ఇప్పుడు ముందే అప్రమత్తమైంది. వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా.. జాగ్రత్తలు తీసుకుంది.

Read More:

తిరుమలకు జలకళ.. నిండుకుండలా జలాశయాలు

తిరుమల ఘాట్ రోడ్లు బంద్

Heavy Rain in Tirumala: తిరుమలలో కుండపోత.. కనువిందు చేస్తున్న కపిలతీర్థం జలపాతం