Lokesh Nara: యుద్ధంలో నాతో చేరండి అంటూ నారా లోకేశ్ పిలుపు.. మద్దతు పలుకుతూ ట్వీట్ చేసిన టాలీవుడ్ హీరో
దేశం, రాష్ట్రం, తెగులు ప్రజలకోసం ఎంతో చేసిన వ్యక్తి, ఇలాంటి అన్యాయాన్ని ఎందుకు భరించాలని లోకేశ్ ప్రశ్నించారు.

Nara Lokesh
Chandrababu Naidu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చిన విషయం విధితమే. ఆదివారం అర్థరాత్రి సమయంలో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. తన తండ్రి ఎన్నడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్ చేయడంచూసి తనకోపం కట్టలు తెంచుకుంటోందని, రక్తం మరుగుతోందని అన్నారు. కక్ష సాధింపు చర్యలు, విధ్వంసక రాజకీయాలకు ఆయన ఎప్పుడూ పాల్పడలేదని ట్వీట్ లో లోకేశ్ పేర్కొన్నారు.
దేశం, రాష్ట్రం, తెలుగు ప్రజలకోసం ఎంతో చేసిన వ్యక్తి, ఇలాంటి అన్యాయాన్ని ఎందుకు భరించాలని లోకేశ్ ప్రశ్నించారు. నేను చంద్రబాబు నుంచి ప్రేరణ పొంది అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదులుకొని భారత్ కు తిరిగొచ్చా. ఇది కఠినమైన నిర్ణయమైనా నాకు మన దేశం, వ్యవస్థలు, అన్నింటికి మించి మన రాజ్యాంగంపై నమ్మకం ఉంది అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
ఈ రోజు ద్రోహంలా అనిపిస్తోంది. మా నాన్న పోరాట యోధుడు. నేనుకూడా అంతే. ఏపీకోసం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకోసం తిరుగులేని శక్తితో మేం ఎదుగుతాం. ఈ యుద్ధంలో నాతో చేరమని మిమ్మల్ని కోరుతున్నా అని లోకేశ్ పిలుపునిచ్చారు. లోకేశ్ ట్వీట్ కు స్పందించిన ప్రముఖ సినీహీరో ట్వీట్ చేశారు. అన్యాయం ఎక్కువకాలం నిలవదు.. కానీ సత్యం శాశ్వతంగా ఉంటుంది. దీనితో పోరాడుదాం నారా లోకేశ్ అన్నా అంటూ టాలీవుడ్ హీరో నారా రోహిత్ ట్వీట్ చేశారు.
Injustice may be fleeting, but truth endures eternally. Let's fight this @naralokesh anna! #WeStandWithCBNSir #ChandrababuNaidu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu https://t.co/B9MW3rlgbi
— Rohith Nara (@IamRohithNara) September 10, 2023