Train Accident : అల్లూరి జిల్లాలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

అల్లూరి జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. శివలింగపురం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

Train Accident : అల్లూరి జిల్లాలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

Train Accident : అల్లూరి సీతారామరాజు జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. శివలింగపురం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 23 బోగీలు పక్కకు ఒరిగి ధ్వంసం అయ్యాయి. 2 కిలో మీటర్ల వరకు రైలు పట్టాలు విరిగాయి.

ఛత్తీస్ గడ్ లోని బచేలి నుంచి విశాఖకు ముడి ఇనుముతో వెళ్తోన్న గూడ్స్ రైలు కిరండోల్-విశాఖ మార్గంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలుకు చెందిన 8 బోగీలు పక్కకు ఒరిగాయి. దీంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తాంభాలు దెబ్బతిన్నాయి.

Goods Train : పట్టాలు తప్పిన రైలు.. ఎనిమిది వ్యాగ‌న్‌లు బోల్తా.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

రైల్వే సిబ్బంది రంగంలోకి దిగింది. ట్రాక్ పై పడిపోయిన బోగీలను తొలగిస్తున్నారు. ఈ మార్గం గుండా విశాఖ నుంచి కిరండోల్ వెళ్లే ప్యాసింజర్ రైలును అధికారులు రద్దు చేశారు.

సమాచారం తెలుసుకున్న రైల్వే డీఆర్ఎం సత్పతి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ట్రాక్ పునరుద్ధరణ పనులకు 36 గంటలు పట్టే అవకాశముందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.