TTD 2023-24 Budget : టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ రూ.4,411.68 కోట్లు

టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు. టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ 4,411.68 కోట్లుగా పేర్కొన్నారు. హుండీ ద్వారా 1,591 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని అంచనా వేశారు.

TTD 2023-24 Budget : టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ రూ.4,411.68 కోట్లు

YV Subbareddy

TTD 2023-24 Budget : టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు. టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ 4,411.68 కోట్లుగా పేర్కొన్నారు. హుండీ ద్వారా 1,591 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని అంచనా వేశారు. పెట్టుబడుల ద్వారా వడ్డీ రూ.990 కోట్లు, ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.500 కోట్లు, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.330 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా అని తెలిపారు. ఆర్జిత సేవల ద్వారా రూ.140 కోట్లు, అద్దె గదులు, కళ్యాణ మండపాల ద్వారా రూ.129 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా126.50 కోట్లు వస్తాయని అంచనా వేశారు.

మానవ వనరులు, కార్మికుల జీత బత్యాలకు రూ.1,532 కోట్లు, మెటీరియల్ కొనుగోళ్లకు రూ.690 కోట్లు, కార్పస్ ఫండ్ ఇతర పెట్టుబడులకు రూ.600 కోట్లు, ఇంజనీరింగ్ పనులకు రూ.300 కోట్లు, తిరుపతిలో శ్రీనివాస సేతు వంతెన నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గతనెల(మార్చి15)వ తేదిన పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల కారణంగా పాలకమండలి నిర్ణయాలు బహిర్గతం చేయలేదన్నారు. 2023-24 సంవత్సరానికి రూ.4,411 కోట్ల అంచనాతో బడ్జెట్ కు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.

TTD EO : నడకదారి భక్తులకు త్వరలో టోకెన్లు పున:ప్రారంభం : టీటీడీ ఈవో

ఏప్రిల్ చివరి కల్లా శ్రీనివాస సేతు ప్రారంభిస్తామని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆన్ లైన్ సేవలను ఇకపై నిరంతరాయంగా కొనసాగిస్తామని తెలిపారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం రూ.5.25 కోట్ల వ్యయంతో అదనపు లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం ఉల్లందూర్ పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అదనంగా రూ.4 కోట్లు కేటాయించామని తెలిపారు. యస్.జీ.ఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనపు భవన నిర్మాణాలకు రూ.4.71 కోట్లు కేటాయించామని చెప్పారు. ఒంటిమిట్టలో ఏప్రిల్ 5న శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణం నిర్వహిస్తామన్నారు.

కళ్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో భక్తుల రద్ది దృష్యా వీఐపీ సిఫార్సు లేఖలు జారి చేసేవారు నియంత్రణ చేసుకోవాలని సూచించారు. వీఐపీ బ్రేక్ దర్శవ సమయ మార్పు విధానాన్ని కొనసాగిస్తామన్నారు. డిసెంబర్ కల్లా చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే బాలాజి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీని సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.