Ghat Roads : టీటీడీ ముందుచూపు, ఘాట్ రోడ్ల మధ్య లింక్ రోడ్డు

రెండో ఘాట్‌ రోడ్‌ను.. మొదటి ఘాట్‌ రోడ్‌తో కలుపుతూ నిర్మించిన లింక్‌ రోడు మోకాళ్లమిట్ట వద్ద కలుస్తుంది.

Ghat Roads : టీటీడీ ముందుచూపు, ఘాట్ రోడ్ల మధ్య లింక్ రోడ్డు

Ttd

TTD Ghat Roads : తిరుపతిలో ఘాట్‌ రోడ్ల నిర్మాణం విషయంలో టీటీడీ అధికారులు ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు. రెండో ఘాట్‌ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడటం, ఏదైనా ప్రమాదాలు జరిగినా తిరుమల వెళ్లే భక్తులు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు వీలుగా రెండు ఘాట్‌ రోడ్ల మధ్య లింక్‌ రోడ్‌ నిర్మించారు. ఈ లింక్‌ రోడ్‌ పలు సందర్భాల్లో టీటీడీకి ఆపద్బాంధవుడిగా ఉపయోగపడుతోంది. రెండో ఘాట్‌ రోడ్‌ను.. మొదటి ఘాట్‌ రోడ్‌తో కలుపుతూ నిర్మించిన లింక్‌ రోడు మోకాళ్లమిట్ట వద్ద కలుస్తుంది.

Read More : Omicron Threat..Mask Must :తెలంగాణలో మాస్క్ మస్ట్..లేదంటే..రూ. 1000 జరిమానా

కొండ చరియలు విరిగిపటడంతో రెండో ఘాట్‌ రోడ్‌ పునరుద్ధరణకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మొదటి ఘాట్‌ రోడ్‌ నుంచే రాకపోకలు సాగుతున్నాయి. మొదటి ఘాట్‌ రోడ్‌పై ఒత్తిడి తగ్గించేందుకు లింక్‌ నుంచి వాహనాలను అమనుతించే అంశంపై టీటీడీ అధికారులు చర్చిస్తున్నారు.

Read More : Telangana : ఒమిక్రాన్ తెలంగాణలోకి ఎంటరయ్యిందా ? మొదటి ప్రమాద హెచ్చరిక – డీహెచ్

మరోవైపు…తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలను తొలగించే పనులు చేపడుతున్నారు. ఎక్కువ భాగం ధ్వంసం కావడంతో..పునరుద్ధరించడానికి కనీసం మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చెన్నై ఐఐటీ బృందం ఘాట్ రోడ్డును పరిశీలించిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన మరో ఐఐటీ బృందం తిరుమలకు వచ్చి ఘాట్ రోడ్డును పరిశీలించనుంది. తిరుమలలో కనీవినీ ఎరుగని వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఘాట్ రోడ్డులోని 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చెరియలు విరిగిపడుతున్న సమయంలో ఓ ఆర్టీసీ బస్సు అక్కడికి చేరుకోగా డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.