Tirumala : స్వయంగా వచ్చిన వీఐపీలకే.. తిరుమలలో 10రోజులు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం

స్వయంగా వచ్చిన వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని ఈవో స్పష్టం చేశారు. విఐపీలు సిఫార్సు లేఖలు ఇవ్వద్దని ఆయన కోరారు.

Tirumala : స్వయంగా వచ్చిన వీఐపీలకే.. తిరుమలలో 10రోజులు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం

Tirumala

Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం పది రోజుల పాటు జరుపుకోవడం గత ఏడాది ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 11న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందన్నారు.

Jio Users : జియో యూజర్లు రీచార్జీ తేదీ మరిచిపోయారా? నో ప్రాబ్లమ్

13న శ్రీవారి ఆలయంలో నిత్య పూజా కైంకర్యాలు జరుగుతాయన్నారు. అనంతరం వేకువజామున 1.40 గంటల నుండి వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభమవుతుందన్నారు. స్వయంగా వచ్చిన వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని ఈవో స్పష్టం చేశారు. విఐపీలు సిఫార్సు లేఖలు ఇవ్వద్దని ఆయన కోరారు. తిరుమలలో వసతి గదులు మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో వీలైనంతవరకూ తిరుపతిలోనే వసతి గదులు పొందాలని ఈవో సూచించారు.

Weight Loss : బరువు తగ్గటంలో వ్యాయామాలకు తోడుగా..

కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ లేదా వ్యాక్సిన్ రెండు డోసుల సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని ఈవో సూచించారు. వైకుంఠ ద్వార దర్శనం జరిగే పది రోజుల్లో మూడుమార్లు శ్రీవారి ఆలయంలో పుష్పాలంకరణలు జరుగుతాయని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు.