Cannabis : విశాఖ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

గంజాయి రవాణాను అడ్డుకోటానికి పోలీసులు  వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ స్మగ్లర్లు గంజాయిని ఏపీనుంచి రాష్ట్రాలు దాటిస్తున్నారు.  ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల  నుంచి గంజాయి రవాణా

Cannabis : విశాఖ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Vsp Ganja Seized

Cannabis :  గంజాయి రవాణాను అడ్డుకోటానికి పోలీసులు  వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ స్మగ్లర్లు గంజాయిని ఏపీనుంచి రాష్ట్రాలు దాటిస్తున్నారు.  ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల  నుంచి గంజాయి రవాణా జోరుగా సాగుతోంది.

తాజాగా ఊహించని విధంగా, అనుకోని ఘటనతో రూ.2 కోట్ల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  కానీ నిందితులు ఎవరూ పట్టుబడలేదు.  వివరాలలోకి వెళితే.. జిల్లాలోని ఆనందపురం మండలం నీళ్ల కుండీల జంక్షన్‌లో ఒక వ్యాన్ ఆగి ఉంది.  ఆగి ఉన్న వ్యాన్ ను మరో వ్యాన్ వచ్చి ఢీ కొట్టింది.

దీంతో ఆగి ఉన్నవ్యాన్ బోల్తాపడి అందులోని బస్తాలు బయటపడ్డాయి. వాటిని పరిశీలించి చూడగా 57 బస్తాల్లో నింపి ఉన్న 2,280 కేజీల గంజాయి బయటపడటంతో అక్రమ రవాణా వెలుగు చూసింది.  పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

కాగా…. గంజాయిని తరలిస్తున్న వాహనానికి నెంబర్ ప్లేటుతొలగించటంతో ఇంజన్ నెంబరు,ఛాసిస్ నెంబర్లు ఆధారంగా పోలీసులు దాని యజమానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : Honey Trap : వృధ్దుడిపై హానీ ట్రాప్ తల్లీ,కూతురు అరెస్ట్