Dalits : దేవాలయాల్లోకి దళితులు ప్రవేశించకుండా అడ్డుకున్న అగ్రవర్ణాలు

నార్పల మండలం గుంజే పల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అగ్రవర్ణాలు, దళితుల మద్య వివాదం చెలరేగింది. రామాలయం, పెద్దమ్మ దేవాలయాలలోకి దళితులకు ప్రవేశాన్ని అగ్రవర్ణాలు అడ్డుకున్నాయి.

Dalits : దేవాలయాల్లోకి దళితులు ప్రవేశించకుండా అడ్డుకున్న అగ్రవర్ణాలు

Dalit 11zon

Upper Castes Preventing Dalits : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించినప్పటికీ దేశంలో ఇంకా కుల వివక్ష, మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. సామాజిక అసమానతలు అలాగే ఉన్నాయి. నేటికీ అగ్రవర్ణాల వారు దళితులను ఆలయాలు, ఇళ్లలోకి రానివ్వడం లేదు. తాజాగా అనంతపురం జిల్లాలో ఆలయాల్లోకి దళితులు ప్రవేశించకుండా అగ్రవర్ణాలు అడ్డుకున్నాయి.

నార్పల మండలం గుంజే పల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇదే విషయంపై గ్రామంలో అగ్రవర్ణాల వారికి, దళితుల మద్య వివాదం చెలరేగింది. గ్రామంలోని రామాలయం, పెద్దమ్మ దేవాలయాలలోకి దళితులకు ప్రవేశాన్ని అగ్రవర్ణాలు అడ్డుకున్నారు. రెండు రోజుల నుంచి వివాదం జరుగుతూనేవుంది.

High Court Petition : RRRపై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్

అయితే ఈ రోజు పోలీస్ బందో బస్తుతో ఆర్డీఓ మదుసూధన్, డీఎస్పీ ప్రసాద్ రెడ్డి దేవాలయాలలో దళితులతో పూజలు చేయించారు. దళితులను అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారు. దీంతో అధికారులకు అగ్రవర్ణాల వారి మద్య వాగ్వాదం తోపులాట జరిగింది.

ఆర్డీఓ మదుసూధన్, డీఎస్పీ ప్రసాద్ రెడ్డి అగ్రవర్ణాల వారిని తరిమి కొట్టి, దేవాలయాలలో దళితులతో పూజలు చేయించారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.