AP New cabinet: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉషశ్రీ చరణ్
ఏపీలో కొత్తగా మంత్రి వర్గం కొలువుదీరింది. శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలో మంత్రులు ఒక్కొక్కరుగా తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు తీసుకుంటున్నారు...

Ycp
AP New cabinet: ఏపీలో కొత్తగా మంత్రి వర్గం కొలువుదీరింది. శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలో మంత్రులు ఒక్కొక్కరుగా తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు తీసుకుంటున్నారు. గురువారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉషశ్రీ చరణ్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా పక్షపాత ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
AP new cabinet : చిత్తూరు జిల్లాకు పెద్దపీట.. 8 జిల్లాలకు దక్కని ప్రాతినిద్యం..
మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని, మహిళలకు ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వని 50శాతం రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని కొనియాడారు. మహిళా సాధికారత అన్ని రంగాల్లోనూ సాధించేలా సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. సీఎం జగన్ సూచనల మేరకు తన శాఖ పరిధిలో అద్భుత ఫలితాలు రాబట్టేలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.