Vijayasai Reddy Thanks Balakrishna : బాలకృష్ణకు విజయసాయి రెడ్డి థ్యాంక్స్.. ఎందుకు చెప్పారంటే..

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు. దీనికి కారణం లేకపోలేదు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి మరీ చూసుకున్నారు. అందుకుగాను.. బాలయ్యకు విజయసాయి రెడ్డి థ్యాంక్స్ చెప్పారు.

Vijayasai Reddy Thanks Balakrishna : బాలకృష్ణకు విజయసాయి రెడ్డి థ్యాంక్స్.. ఎందుకు చెప్పారంటే..

Vijayasai Reddy Thanks Balakrishna : వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు. దీనికి కారణం లేకపోలేదు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి మరీ చూసుకున్నారు. అందుకుగాను.. బాలయ్యకు విజయసాయి రెడ్డి థ్యాంక్స్ చెప్పారు.

గుండెపోటుకు గురైన తారకరత్నకు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న నందమూరి తారకరత్నను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్నకు విజయసాయిరెడ్డి బంధువు అన్న సంగతి తెలిసిందే. తారకరత్న భార్య అలేఖ్య ఎవరో కాదు.. విజయసాయిరెడ్డి అర్ధాంగి సునంద చెల్లెలి కూతురే. అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ వరుసలో విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు అవుతారు.

Also Read..Taraka Ratna Health : తారకరత్నకు కిడ్నీలో సమస్య.. సిటి స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు

నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లిన విజయసాయిరెడ్డి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం తారకరత్న గుండె, కాలేయం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా పని చేస్తున్నాయని డాక్టర్లు చెప్పారని తెలిపారు. గుండెకు ఇవాళ ఎలాంటి చికిత్స అందించలేదని, అయితే తారకరత్న మెదడులో వాపు ఏర్పడిందని ఆయన వివరించారు. వాపు తగ్గాక తారకరత్న కోలుకుంటారని డాక్టర్లు చెప్పారని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Also Read..Taraka Ratna Health : చికిత్స పొందుతున్న తారకరత్న ఫోటో లీక్..

”తారకరత్న గుండెపోటుకు గురైన రోజున 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయింది. దాంతో మెదడులో కొంతభాగం దెబ్బతింది. మెదడులో నీరు చేరిన ఈ పరిస్థితిని ఎడిమా అంటారు. దీంతో మెదడు కిందికి జారిపోయే ప్రమాదం ఉంది. మరో మూడు నాలుగు రోజుల్లో మెదడు ఆరోగ్యానికి సంబంధించిన పురోగతి కనిపించవచ్చని డాక్టర్లు ఇటీవల చెప్పారు. ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయింది కాబట్టి, రేపటి నుంచి ఆయన మెదడు ఆరోగ్యం నిలకడగా ఉంటుందని ఆశిస్తున్నాం” అని విజయసాయిరెడ్డి అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రస్తుతం తారకరత్న గుండె చక్కగా పని చేస్తోందని, రక్తప్రసరణ బాగుందని డాక్టర్లు చెప్పినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. డాక్టర్లు అద్భుతమైన చికిత్స అందిస్తున్నారని విజయసాయిరెడ్డి కొనియాడారు. అటు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తారకరత్నకు సంబంధించి అన్ని విషయాలను బాలకృష్ణ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారని విజయసాయి రెడ్డి చెప్పారు.