Taraka Ratna Health : తారకరత్నకు కిడ్నీలో సమస్య.. C.T. స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు

సినీ నటుడు నందమూరి తారకరత్నకు చేసిన సిటి స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆక్సిజన్ సరిగా అదకపోవడంతో బ్రెయిన్ కు అఫెక్ట్ అయినట్లు వైద్యులు గుర్తించారు.

Taraka Ratna Health : తారకరత్నకు కిడ్నీలో సమస్య.. C.T. స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు

Taraka Ratna Health : సినీ నటుడు నందమూరి తారకరత్నకు చేసిన సిటి(CT) స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో బ్రెయిన్ కు ఎఫెక్ట్ అయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బ్రెయిన్ డ్యామేజ్ రికవరీ పైనా నారాయణ హృదయాలయ, నిమ్హాన్స్ వైద్యులు దృష్టి పెట్టారు. తారకరత్నకు కిడ్నీలో సమస్య ఉన్నట్లు గుర్తించిన వైద్య బృందం.. డయాలసిస్ చేసింది.

క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ కావడంతో డయాలసిస్ చేసినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో తారకరత్న ఆసుపత్రి పాలయ్యారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

Also Read..Chiranjeevi Tweet on Tarakarathna : తారకరత్న ఆరోగ్యంపై మెగాస్టార్ ట్వీట్..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో తారకరత్న కుప్పకూలిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను కుప్పంలోని ఆసుపత్రికి తరలించగా.. ఆయన గుండెపోటుకు గురయ్యారని వైద్యులు నిర్ధారించారు. కుప్పంలో ప్రాధమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయనను వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్ తో పాటు అత్యాధునిక పరికరాలతో చికిత్స అందిస్తున్నారు. వైద్యుల తాజా బులెటిన్ ప్రకారం తారకరత్నకు ఎక్మో సపోర్ట్ ఇవ్వడం లేదు.

Also Read..Taraka Ratna Health : చికిత్స పొందుతున్న తారకరత్న ఫోటో లీక్..

మరోవైపు, తారకరత్న పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉన్న పరిస్థితుల్లో.. ఆయనను చూసేందుకు ఐసీయూలోకి కుటుంబ సభ్యులను కూడా వైద్యులు అనుమతించడం లేదు. ఇంకోవైపు, తారకరత్న వెంటిలేటర్ పై ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. తారకరత్న త్వరగా కోలుకుని ఇంటికి రావాలని కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన వారు ప్రార్థనలు చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.