Vijayawada Court : పవన్ కళ్యాణ్ పై మహిళా వాలంటీర్ కేసు.. ఫిర్యాదు వెనక్కి పంపిన విజయవాడ కోర్టు

ఈ వ్యవహారంపై విచారణ చేసే అధికారం ఈ కోర్టు పరిధిలోకి ఎలా వస్తుందో స్పష్టత ఇవ్వాలని తెలిపింది. పవన్ వ్యాఖ్యలు ఫిర్యాదురాలి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

Vijayawada Court : పవన్ కళ్యాణ్ పై మహిళా వాలంటీర్ కేసు.. ఫిర్యాదు వెనక్కి పంపిన విజయవాడ కోర్టు

Vijayawada Court

Updated On : July 26, 2023 / 3:11 PM IST

Volunteer Complaint Against Pawan Kalyan : వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహిళా వాలంటీర్ విజయవాడ కోర్టును ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ పై వాలంటీర్ కేసు ఫైల్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థకు పరువు నష్టం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్ కళ్యాణ్ పై దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును విజయవాడ కోర్టు తిప్పి పంపింది.

ఈ వ్యవహారంపై విచారణ చేసే అధికారం ఈ కోర్టు పరిధిలోకి ఎలా వస్తుందో స్పష్టత ఇవ్వాలని తెలిపింది. పవన్ వ్యాఖ్యలు ఫిర్యాదురాలి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఏపీలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో పవన్ కళ్యాణ్ పై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan : ప్రజల డబ్బులు దోచేస్తారు- మరోసారి వాలంటీర్లపై పవన్ సంచలన వ్యాఖ్యలు

మహిళా వాలంటీర్ విజయవాడ కోర్టును ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ పై వాలంటీర్ కేసు ఫైల్ చేశారు. తమపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురయ్యానని, తనకు న్యాయం చేయాలని మహిళా వాలంటీర్ కోరారు. వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. సెక్షన్స్ 499, 500, 504, 505 రెడ్ విత్ 507,511 ఆఫ్ ఐపీసీ ప్రకారం కేసు దాఖలు చేశారు.

విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల బాధితురాలు తీవ్ర మనోవేదనకు గురయ్యారని వాలంటీర్ తరపు న్యాయవాదులు వెల్లడించారు.
కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుందన్నారు. బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కు కోర్టు నోటీసులు ఇస్తుందని తెలిపారు.

Eluru : పవన్ కళ్యాణ్ పై వైసీపీ, వాలంటీర్లు, దళిత సంఘాలు ఫైర్.. పవన్ దిష్టిబొమ్మలు దగ్ధం

పవన్ కోర్టుకు హాజరు కావాల్సివుందన్నారు. కోర్టు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయని తెలిపారు. వాలంటీర్లలో అధికశాతం మహిళలు ఉన్నారని తెలిపారు. ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు చెప్పి ఉంటే ఆ ఆధారాలను కోర్టుకు వెల్లడించాలని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ అనుచతి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Pawan Kalyan: వాలంటీర్లపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

పవన్ వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉందని ఆరోపించారు. అబద్ధపు వదంతులు చేసి ప్రజలను రెచ్చగొట్టి, వాలంటీర్లపై తిరగబడేలా వ్యాఖ్యలు చేసిన పవన్ పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరామని న్యాయమూర్తులు తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తను ఎంతో బాధించాయని మహిళా వాలంటీర్ వాపోయారు. పవన్ తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.

ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలు అవాస్తవం అన్నారు. తాను భర్త చనిపోయి పిల్లలతో జీవిస్తున్నానని చెప్పారు. పవన్ వ్యాఖ్యల తర్వాత చుట్టుపక్కల తనను వారు ప్రశ్నించారని తెలిపారు. ఉమెన్ ట్రాఫికింగ్ అంశాలపై కొందరు తనను ప్రశ్నించారని చెప్పారు. నిస్వార్ధంగా సేవ చేస్తున్న తమపై నిందలు వేసి పవన్ తప్పు చేశారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.