Vijayawada Govt Hospital: విజయవాడ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది మరో నిర్లక్ష్యం

కొవిడ్ తో పోరాడి ప్రాణాలతో తిరిగొస్తుందనుకుని ఎదురుచూసిన భార్య కరోనాతో చనిపోయింది. మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాన్ని అప్పగించడంతో ఆ వ్యక్తి అంత్యక్రియలు పూర్తి చేశాడు.

Vijayawada Govt Hospital: విజయవాడ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది మరో నిర్లక్ష్యం

Vijayawada Govt Hosp

Vijayawada Govt Hospital: కొవిడ్ తో పోరాడి ప్రాణాలతో తిరిగొస్తుందనుకుని ఎదురుచూసిన భార్య కరోనాతో చనిపోయింది. మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాన్ని అప్పగించడంతో ఆ వ్యక్తి అంత్యక్రియలు పూర్తి చేశాడు. కొవిడ్ సోకిన కన్న కొడుకు మరి కొద్ది రోజులకే చనిపోయాడు. భార్యతో పాటు కొడుక్కి దశ దిన కర్మలు పూర్తి చేసిన వ్యక్తికి షాక్. చనిపోయిందనుకున్న భార్య తిరిగొచ్చింది.

గతంలో ఓ సారి జరిగిన పొరబాటే మళ్లీ జరిగింది విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో. మృతదేహం మారిపోవడంతో బతికి ఉన్న మనిషికే ఖర్మకాండలు నిర్వహించారు. గడ్డయ్య భార్య ముక్త్యాల గిరిజమ్మకు కరోనా పాజిటివ్ వచ్చి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో చేరింది.

ట్రీట్మెంట్ జరుగుతుండగా.. సిబ్బంది గిరిజమ్మ చనిపోయిందని గడ్డయ్యకు సమాచారం ఇచ్చారు. మార్చురీకి వెళ్లి భార్యను పోలి ఉన్న మృతదేహాన్ని తీసుకుని వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అనారోగ్యంతో ఖమ్మం హాస్పిటల్ లో చేరిన కొడుకు మృతి చెందాడు. ఇద్దరికీ దశ, దిన ఖర్మలు పూర్తి చేశాడు.

బుధవారం చనిపోయిందనుకున్న భార్య తిరిగి ఇంటికి చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న ఆమె జగ్గయ్యపేటలోని ఇంటికి రావడంతో గడ్డయ్య షాక్ తిన్నాడు. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బతికి ఉన్న మనిషికి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు.