Kesineni Nani: టీడీపీకి కేశినేనికి పెరిగిన దూరం.. చంద్రబాబు ఫోటోలు తొలగింపు!

తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు కేశినేని నానికి సంబంధించిన ఆఫీస్ కేశినేని భవన్ నుంచి చంద్రబాబు, టీడీపీ నేతల ఫ్లెక్సీలను తొలగించారు.

Kesineni Nani: టీడీపీకి కేశినేనికి పెరిగిన దూరం.. చంద్రబాబు ఫోటోలు తొలగింపు!

Kesineni Nani

Kesineni Nani: తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు కేశినేని నానికి సంబంధించిన ఆఫీస్ కేశినేని భవన్ నుంచి చంద్రబాబు, టీడీపీ నేతల ఫ్లెక్సీలను తొలగించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో, ఆఫీస్ బయట ఉన్న పార్టీ నేతల ఫోటోలు తొలగించారు కేశినేని కార్యాలయం నిర్వాహకులు. చంద్రబాబు, ఇతర నేతల ఫోటోల స్థానంలో రతన్ టాటాతో తాను కలిసి ఉన్న ఫోటోను పెట్టారు కార్యాలయ సిబ్బంది.

టాటా ట్రస్ట్, ఎంపీ నిధులతో చేసిన పనుల వివరాలతో ఉన్న ఫ్లెక్స్‌‍లను ఈ స్థానంలో ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నాని, ఎంపీగా మాత్రమే కొనసాగుతానని అన్నారు. 2024లో పోటీ చెయ్యనంటూ అధిష్టానానికి తెలిపారు కేశినేని నాని.

బెజవాడ టీడీపీ వర్గపోరును అధిష్టానం సరిదిద్దలేదని అలకబూని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. లేటెస్ట్‌గా ఫ్లెక్స్‌ల మార్పులతో కేశినేని అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. టీడీపీ నుంచి ముఖ్యనేతలుగా ఉన్న బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా కూడా పార్టీలో కేశినేని నానికి వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే.