Waltair Veerayya Released : ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’.. అమెరికాలో 1200 స్క్రీన్స్, తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్స్ లో రిలీజ్

వాల్తేరు వీరయ్య సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగుతోపాటు హిందీలో కూడా వాల్తేరు వీరయ్య రిలీజ్ అయింది. అమెరికాలో 1200 స్క్రీన్స్ లో మూవీని రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్స్ లో సినిమా విడుదల అయింది.

Waltair Veerayya Released : ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’.. అమెరికాలో 1200 స్క్రీన్స్, తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్స్ లో రిలీజ్

Waltair Veerayya (1)

Waltair Veerayya released  : వాల్తేరు వీరయ్య సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగుతోపాటు హిందీలో కూడా వాల్తేరు వీరయ్య రిలీజ్ అయింది. అమెరికాలో 1200 స్క్రీన్స్ లో మూవీని రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్స్ లో సినిమా విడుదల అయింది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, శృతిహాసన్ కాంబినేషన్ లో తెరకెక్కింది. థియేటర్ల దగ్గర మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సంధ్య థియేటర్ దగ్గర అభిమానుల కోలాహలం మొదలైంది. మెగా అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. జై చిరంజీవి, స్టార్.. స్టార్ మెగా స్టార్ అన్న నినాదాలతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు మార్మోగుతోంది. అభిమానులతో కలిసి చిత్ర యూనిటీ సినిమా చూస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీ, దర్శకుడు హరీశ్ శంకర్ సంధ్య థియేటర్ కు వచ్చారు.

Waltair Veerayya: ఏపీలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా టికెట్ ధరల పెంపు!

మెగాస్టార్ చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజ సైతం థియేటర్ లో సందడి చేశారు. అభిమానులతో కలిసి మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చెప్పే డైలాగ్స్, ఆయన వేసే స్టెప్పులకు అనూహ్య స్పందన వస్తోంది. ముందే చెప్పినట్లుగా థియేటర్ లో అభిమానులకు పూనకాలు రప్పిస్తోంది. చిరు స్టెప్పులకు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.

తెలంగాణలో మాత్రం ఆరు షోలకు అనుమతి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజామున 4 గంటలకే షోలు థియేటర్లలో పడ్డాయి. హైదరాబాద్  ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో తెల్లవారుజామున 4 గంటలకే సినిమా షో పడింది. థియేటర్ కు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చారు. థియేటర్స్ లోపల, బయట అభిమానులు కోలాహలం చేస్తున్నారు. సినిమా స్టార్ట్ అవుతున్న సందర్భంగా పేపర్స్, పూలు స్క్రీన్స్ పై వేస్తూ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఈలలు వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అరుపులు, కేకలతో థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతోంది.