వాటర్ డ్రోన్ : నీటి ప్రమాద బాధితుల కోసం 

నేటి యువత టెక్నాలజీని డెవలప్ చేయటంలో ముందుంటున్నారు. వినూత్న ఆవిష్కరణలో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 07:21 AM IST
వాటర్ డ్రోన్ : నీటి ప్రమాద బాధితుల కోసం 

నేటి యువత టెక్నాలజీని డెవలప్ చేయటంలో ముందుంటున్నారు. వినూత్న ఆవిష్కరణలో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.

విశాఖపట్నం : నేటి యువత టెక్నాలజీని డెవలప్ చేయటంలో ముందుంటున్నారు. వినూత్న ఆవిష్కరణలో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఈ టెక్నాలజీ ప్రాణాల్ని కాపాడటంలో విశేషంగా ఉపయోగపడుతోంది. వైద్యశాస్త్రంలో వచ్చిన అనేక మార్పులు దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ క ్రమంలో విశాఖపట్నానికి చెందిన ఓ  టెకీ తాను కనిపెట్టిన ‘వాటర్ డ్రోన్’ తో పలువురి ప్రశంసల్ని అందుకుంటున్నారు. నీటిలోమునిగిపోయేవారి కోసం ఈ సరికొత్త  వాటర్ డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నాడు వాటర్ డ్రోన్ తయారు చేసిన అలియా సాగర్ కల్కతావాలా. 
Read Also : Fans Upset : అవెంజర్స్.. ఎండ్ గేమ్ : రెహమాన్ ‘మార్వెల్’సాంగ్ రిలీజ్

సైఫ్ ఆటోమేషన్ సర్వీసెస్ (ఎస్ఏఎస్) సహ వ్యవస్థాపకుడు, అలియాసాగర్ కల్కతావాలా సరికొత్త వాటర్ డ్రోన్ ను కనిపెట్టారు. భారత నావికా దళంతోపాటు పలు మున్సిపాలిటీలు కూడా ఇటువంటి వాటర్ డ్రోన్లను తయారు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయనీ.. ఇది అందుబాటులో నీటిలోకి వెళ్లకుండానే బాధితులను రక్షించవచ్చని..నీటిలో పడిపోయిన బాధితులు ఉన్న దిశలో ఈ వాటర్ డ్రోన్ ను  పంపిస్తే..వారు దీన్ని పట్టుకుని సురక్షితంగా బైటపడవచ్చని తెలిపారు.

వాటర్ డ్రోన్ ప్రత్యేకతలు 

  • గుర్రపునాడ ఆకారం..
  • డ్రోన్ బరువు 12 కిలోలు
  • నీటిలో గంటకు 13 కిమీలు ప్రయాణం  
  • 300 కిలోల బరువును మోయగలిగే కెపాసిటీ 
  • రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేసే డ్రోన్ రిమోట్
  • 3 కిమీల వరకు సిగ్నల్స్‌ను క్యాచ్ చేసే సామర్థ్యం
  • అవసరాన్నిబట్టి 10 కిలో మీటర్ల దూరం వెళ్లేలా పెంచుకునే సదుపాయం 
  • నీళ్లలో మునిగిపోతున్న వ్యక్తులను గుర్తించే టెక్నాలజీ డ్రోన్ స్పెషల్