Genome Sequencing Lab : ఇక విజయవాడలోనే ఒమిక్రాన్ కేసుల నిర్ధారణ.. దేశంలోనే రెండో సంపూర్ణ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్

జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లు దేశంలో కొన్ని ఉన్నప్పటికీ.. ఇలా సంపూర్ణంగా సీక్వెన్సింగ్ చేసే ల్యాబ్ ఇది రెండోదే. మొదటిది కేరళలో ఏర్పాటు చేయగా రెండోది విజయవాడకు కేటాయించారు.

Genome Sequencing Lab : ఇక విజయవాడలోనే ఒమిక్రాన్ కేసుల నిర్ధారణ.. దేశంలోనే రెండో సంపూర్ణ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్

Lab (1)

Whole Genome Sequencing Lab : ఒమిక్రాన్ కేసుల నిర్ధారణ ఇక విజయవాడలోనే జరుగనుంది. విజయవాడలోని సిద్ధార్ధ మెడికల్ కాలేజ్‌లో సంపూర్ణ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. కేసులు పెరుగుతుండడంతో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ స్థానికంగా అందుబాటులోకి రావడంతో.. వేరియంట్‌ను వేగంగా నిర్ధారించే అవకాశం ఉంది. జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లు దేశంలో కొన్ని ఉన్నప్పటికీ.. ఇలా సంపూర్ణంగా సీక్వెన్సింగ్ చేసే ల్యాబ్ ఇది రెండోదే. మొదటిది కేరళలో ఏర్పాటు చేయగా రెండోది విజయవాడకు కేటాయించారు. ఒమిక్రాన్‌తో పాటు ఇతర వేరియంట్లను ఈ ల్యాబ్‌లో నిర్ధారించవచ్చు.

మూడురోజుల్లో వేరియంట్ నిర్ధారణ జరుగుతుంది. ఇప్పటిదాకా శాంపిళ్లను హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇప్పుడిక స్థానికంగానే నిర్ధారించే అవకాశముంటుంది. దీనివల్ల రోగులను త్వరగా గుర్తించి ఐసొలేట్ చేయడం, చికిత్స అందించడానికి వీలవుతుంది. వేరియంట్ వ్యాప్తి నియంత్రించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోనే ఈ ల్యాబ్ పని చేయనుంది. ఈ ల్యాబ్‌కు హైదరాబాద్‌కు చెందిన CCMB, CSIR సహకారమందిస్తున్నాయి.

Selfie Video : రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు.. కలకలం రేపుతోన్న సెల్ఫీ వీడియో

ఒమిక్రాన్ వేరియంటో ఏపీపై పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న మరో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. గుంటూరు మహిళతో పాటు మరో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసుల్లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 28కి పెరిగింది.

మరోవైపు ఏపీలో మళ్లీ కరోనా వ్యాప్తి విజృంభిస్తోంది. రాష్ట్రంలో భారీగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. నిన్నటి (334) పోలిస్తే 100 కేసులు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 32వేల 785 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 434 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. గత నెల రోజుల్లో 200కు పైగా కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. నిన్న 334 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

Corona Cases Telangana : తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. 5 రోజుల్లోనే 5 రెట్లు పెరిగిన కేసులు

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,78,376కి పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో ఒక్కరు కూడా చనిపోలేదు. రాష్ట్రంలో కరోనా బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,499గా ఉంది. ఒక్కరోజు వ్యవధిలో 102 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,029 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,848 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 434 కేసులు నమోదవగా.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు వెలుగుచూశాయి. విశాఖలో 63, కృష్ణా జిల్లాలో 61 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా 7 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి.

Nagarjuna’s Comments : నాగార్జున వ్యాఖ్యలపై స్టార్ హీరోలు, పెద్ద నిర్మాతల అసంతృప్తి

మూడో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓ ముఖ్య సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్‌ సాధారణ జలుబు లాంటి వ్యాధి కాదని, ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం చూపించొచ్చని హెచ్చరించారు.