Extra Marital Affair : సచివాలయ ఉద్యోగి రాసలీలలు-రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య

ఆంధ్రప్రదేశ్  గ్రామ సచివాలయంలో పని చేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాసలీలలు వెలుగు చూశాయి.

Extra Marital Affair : సచివాలయ ఉద్యోగి రాసలీలలు-రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య

Extra Marital Affair :  ఆంధ్రప్రదేశ్  గ్రామ సచివాలయంలో పని చేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాసలీలలు వెలుగు చూశాయి. సచివాలయ విధులకు హాజరైనట్లు రిజిస్టర్లో సంతకం చేసి అక్కడ నుంచి జంప్ అయ్యి రాసలీలల్లో మునిగి తేలుతున్నాడు. కట్టుకున్న భార్య ఈ అక్రమ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినా.. అతనిలో మార్పు రాకపోగా.. రాసలీలలు నడిపిన యువతినే పెళ్లి చేసుకుని కట్టుకున్న భార్య, పోలీసులకు షాకిచ్చాడు.

నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పోట్లపూడి సచివాలయంలో చలం వెంకటేష్ అనే వ్యక్తి ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇతని స్వగ్రామం ఇందుకూరుపేట. 2020 లో బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన సుమచందు అనే యువతతో పెళ్లయింది. భారీగానే కట్నకానుకలు ఇచ్చారు. అయితే కొంతకాలం నుంచి వెంకటేష్… విలుకానిపల్లికి చెందిన ఓ యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ప్రతిరోజు సచివాలయనికి రావడం.. విధులకు హాజరైనట్లు రిజిస్టర్‌లో సంతకం చేయడం.. కొంతసేపటి తర్వాత అక్కడ నుంచి పత్తా లేకుండా వెళ్లిపోయి రాసలీలల్లో మునిగి తేలటం పరిపాటయిపోయింది.

ఇదే విషయం భార్య సుమచందుకి కూడా తెలియడంతో గత కొద్దిరోజులుగా భార్య కూడా భర్తపై నిఘా పెట్టింది. ఇదే క్రమంలో 5 రోజుల క్రితం కూడా గ్రామ సచివాలయ రికార్డుల ప్రకారం కార్యాలయానికి వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయాడు. సీన్ కట్ చేస్తే….. నెల్లూరు సూర్య గెస్ట్ ఇన్‌లో   ప్రియురాలితో రాసలీలల్లో మునిగిపోయి కట్టుకున్న భార్యకు, బంధువులకు దొరికిపోయి అడ్డంగా బుక్కయ్యాడు. భర్త ప్రియురాలితో కలిసి గెస్ట్ ఇన్ లో   ఉన్నాడని తెలుసుకున్న భార్య.. తన బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి లాడ్జి వద్దకు వెళ్లడంతో అడ్డంగా దొరికిపోయారు వెంకటేష్, ఆయన ప్రియురాలు. దాంతో వెంకటేష్ భార్య 100 కి కాల్ చేసి బాలాజీ నగర్ పోలీసులకు అప్పజెప్పారు.

ప్రియురాలితో హోటల్‌లో   దొరికిపోవటంతో వెంకటేష్‌ను పోలీస్ స్టేషన్‌కు  తీసుకు రాగానే సమాచారం తెలుసుకున్న వెంకటేష్ తండ్రి శ్రీనివాసులు మరికొందరు కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఇక తన కుమారుడు ఎప్పుడు అలాంటి చర్యలకు పాల్పడడు..బుద్ధిగా భార్యతో కాపురం చేసుకుంటాడoటూ పోలీసులకు హామీ పత్రం కూడా ఇచ్చారట. దీంతో కౌన్సిలింగ్ ఇచ్చిన ఆరో పట్టణ పోలీసులు బుద్దిగా కాపురం చేసుకోండని వెంకటేష్‌కు, భార్యకు చెప్పి బయటకు పంపారు.

అయితే ఇది జరిగి ఒకరోజు గడవక ముందే  హోటల్ రూమ్‌లో రాసలీలలతో పట్టుబడ్డ యువతిని వెంకటేష్ పెళ్లి చేసుకుని తన అమ్మమ్మ ఇంటిలో కాపురం కూడా పెట్టేశా డు. దీంతో విషయం తెలుసుకున్న భార్య సుమ చందు.. అక్కడికి వెళ్లి వెంకటేష్ రెండో పెళ్లి చేసుకున్న యువతిని నిలదీయడంతో వెంకటేష్ అమ్మమ్మ, తాతయ్యలు సాయి చందుపై   దాడికి దిగి గాయపరిచారు. దీంతో అసలు భార్య సాయి చందు తనకు న్యాయం చేయాలని తన స్వగ్రామ మైన బుచ్చిరెడ్డిపాలెంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చిత్రహింసలు పెట్టిన భర్త, అత్తమామలు,  అవ్వతాతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. మరోవైపు పోట్లపూడి గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెంకటేష్ రిజిస్టర్లో సంతకం చేసి రాసలీలలతో పట్టుబడ్డ వ్యవహారం వెలుగు చూడడంతో ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగం నిర్వహణపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్టర్లో సంతకాలు చేసి ఉద్యోగులు ఎక్కడెక్కడో తిరుగుతున్నా.. పర్యవేక్షకులు ఏమి చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Also Read : Adolf Hitler : హిట్లర్ ధరిచిన వాచీ వేలంలో ఎన్ని కోట్లు పలికిందో తెలుసా…