Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్.. పార్లమెంటులో టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం

గల్లా జయదేవ్ ఆరోపణలకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. Chandrababu Arrest Issue

Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్.. పార్లమెంటులో టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం

Chandrababu Arrest Issue

Updated On : September 18, 2023 / 9:31 PM IST

Chandrababu Arrest Issue : చంద్రబాబు అరెస్ట్ పై పార్లమెంటులో వైసీపీ, టీడీపీ నేతలు మాటల యుద్ధానికి దిగారు. గల్లా జయదేవ్, మిథున్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని గల్లా జయదేవ్ ఆరోపించారు. ఏపీలో చట్టాలను తుంగలో తొక్కారని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ చేశారని గల్లా జయదేవ్ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Also Read..Brahmani Nara : చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..? పార్టీ కష్టాల్లో ఉండటంతో బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధం

గల్లా జయదేవ్ ఆరోపణలకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. రూ.371 కోట్ల అవినీతి జరిగిందన్నారు. సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబును అరెస్ట్ చేశారని, ఇందులో అక్రమం ఏదీ లేదని, రాజకీయ కక్ష సాధింపు లేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలా సభలో కాసేపు ఇరు పార్టీల ఎంపీల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాగా.. కోర్టు పరిధిలోని అంశాలపై పార్లమెంటులో మాట్లాడటం సరికాదని ప్యానల్ స్పీకర్ ఇరువురికీ సర్ది చెప్పారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. పొలిటికల్ హీట్ పెంచింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. చంద్రబాబు స్కామ్ చేశారని, సాక్ష్యాలతో అరెస్ట్ చేశారని, ఇందులో రాజకీయ కక్ష ఏమీ లేదని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు దీనిపై జాతీయ స్థాయిలో నారా లోకేశ్ పోరాటం చేస్తున్నారు.

Also Read..TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?