No Interviews: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూల్లేవ్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ, గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఎత్తి వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

No Interviews: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూల్లేవ్!

YCP Govt cancelled personal interviews for APPSC staff recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ, గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఎత్తి వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. గ్రూప్‌ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీవోను జారీ చేశారు.

ఉద్యోగాల ఎంపికలో ఇకనుంచి ఇంటర్వ్యూలు ఉండబోవని, పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా శశిభూషణ్ తెలిపారు. పోటీ పరీక్షల్లో ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు అధికారులు.