Ycp bus yatra: రెండోరోజు వైసీపీ నేతల సామాజిక న్యాయభేరి యాత్ర .. ఏ సమయంలో ఎక్కడికి చేరుతుందంటే..

వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయభేరి యాత్ర రెండవ రోజు శుక్రవారం కొనసాగనుంది. విశాఖ పట్టణం నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9గంటలకు పాత గాజువాక వైఎస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు యాత్రను ప్రారంభించనున్నారు.

Ycp bus yatra: రెండోరోజు వైసీపీ నేతల సామాజిక న్యాయభేరి యాత్ర .. ఏ సమయంలో ఎక్కడికి చేరుతుందంటే..

Ycp Basu Yatra

Ycp bus yatra: వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయభేరి యాత్ర రెండవ రోజు శుక్రవారం కొనసాగనుంది. విశాఖ పట్టణం నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9గంటలకు పాత గాజువాక వైఎస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు యాత్రను ప్రారంభించనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఈనెల 30తో మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చేసిన సామాజిక న్యాయాన్ని వివరించేందుకు వైసీపీ ప్రజాప్రతినిధులు సామాజిక న్యాయభేరి పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

YCP Bus tour: బస్సు యాత్రకు సిద్ధమవుతున్న ఏపీ మంత్రులు: వైజాగ్ ‘టు’ అనంతపూర్

ఈ యాత్ర ఏపీ వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో కొనసాగనుంది. ఈ నెల 29వరకు వరుసగా నాలుగు రోజుల పాటు వైసీపీ మంత్రులు నాలుగు సభలు నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్రలో 17 మంది మంత్రులతో పాటు వైసీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. గురువార ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. శ్రీకాకుళం నుంచి విజయనగరం జిల్లా మీదుగా విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. శుక్రవారం రెండోరోజు యాత్రను విశాఖ పట్టణంలోని పాత గాజువాక లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రులు యత్రను ప్రారంభించనున్నారు.

AP CM Ys Jagan : దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్

ఉదయం 10.15 గంటలకు లంకాల పాలెం జంక్షన్, 10.45 గంటలకు అనకాపల్లి బై పాస్ రోడ్డు, 11.15 గంటలకు తాల్ల పాలెం జంక్షన్ కు యాత్ర చేరుకుంటుంది. ఉదయం 11.45 గంటలకు యలమంచిలి వైరోడ్ జంక్షన్, మధ్యాహ్నం 12.15 గంటలకు నక్క పల్లికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు తుని, 1.15 నుండి 2.30 గంటల వరకూ అన్నవరంకు బస్సు యాత్ర చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్న భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు జగ్గపేట మీదుగా బస్సు యాత్ర కొనసాగుతుంది. 4.30 గంటలకు రాజమండ్రి మున్సిపల్ గ్రౌండ్ (కోటిపల్లి బస్టాండ్) లో జరిగే బహిరంగ సభలో మంత్రులు, వైసీపీ నేతలు ప్రసంగించనున్నారు.